ETV Bharat / sports

టైటిట్‌ ఫేవరెట్​ భారత్​తో పోటీ - డెబ్యూలోనే దడ పుట్టించాలంటున్న యంగ్​ టీమ్స్​ - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 9:43 AM IST

T20 World Cup 2024 Preview : టీ20 ప్రపంచకప్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అందరూ ఎదురుచూస్తోంది ఆ దాయాది దేశాల మధ్య సమరం గురించే! ఆ జట్లే, భారత్, పాకిస్థాన్‌. ఈ జట్ల మధ్య రసవత్తర పోరు కారణంగా గ్రూప్‌- ఎపై ఆసక్తి నెలకొంది. ఈ గ్రూప్‌లో వీటితో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడా ఉన్నాయి. మరి ఈ గ్రూప్స్ ఎలా ఆడనున్నాయంటే?

T20 World Cup 2024 Preview
T20 World Cup 2024 Preview (Source : Getty Images)

T20 World Cup 2024 Preview : 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత టీమ్ఇండియా మరోసారి ఈ కప్‌ను ముద్దాడలేకపోయింది. 2014లో ఫైనల్​లో ఓటమిని చవిచూసింది. చివరగా 2022లో సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నీలో నెగ్గని భారత్‌, ఇప్పుడు ఈ గెలుపుతో కమ్​బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది. నంబర్‌వన్‌ టీ20 జట్టుగా బరిలో దిగనున్న రోహిత్​ సేనపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. జట్టుకు కూడా ఈ కప్‌ గెలిచే సత్తా ఉంది. టైటిట్‌ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌ సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా కనిపిస్తోంది.

రెండో టైటిల్‌పై కన్ను
2009లో టీ20 ప్రపంచకప్​ను ముద్దాడిన పాక్ జట్టు రానున్న టైటిల్​ చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2022లో ఆఖరి వరకు వచ్చి ఓటమిపాలైన ఆ జట్టు, ఈ ఈ సారి కప్​ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఘోర వైఫల్యం వల్ల కెప్టెన్‌గా వేటు ఎదుర్కొన్న బాబర్‌ అజామ్‌ మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

ఇదిలా ఉండగా, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ కిర్‌స్టెన్‌, ఇప్పుడు పాక్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తన శిక్షణలో జట్టు మంచి ఫామ్​ కనబరుస్తుందని ఆశిస్తున్నారు. ఇక పేస్‌ బౌలింగ్‌లో పాక్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. నసీం షా, షహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌, సీనియర్‌ మహమ్మద్‌ అమీర్, అబ్బాస్‌ అఫ్రిది కూడా జట్టులో కీలకం కానున్నారు.

అయితే రిటైర్మెంట్‌ నుంచి వెనక్కివచ్చిన అమీర్‌ పాక్‌కు కీలకమయ్యే అవకాశముంది. అబ్రార్‌ అహ్మద్‌ షాదాబ్‌ ఖాన్, ఇమాద్‌ వసీం, లాంటి టాప్ స్పిన్నర్లు ఆ జట్టుకు బలాన్ని చేకూర్చనున్నారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 54 మ్యాచ్‌లాడిన స్పిన్నర్‌ ఇమాద్‌కు అక్కడి పరిస్థితులు కొట్టిన పిండే. బ్యాటింగ్‌లోనే భారమంతా బాబర్, రిజ్వాన్‌పైనే పడుతోంది. వీళ్లకు తోడు ఫకర్‌ జమాన్, పవర్‌ హిట్టర్లు ఇఫ్తికార్‌ అహ్మద్, అజాం ఖాన్, సయీం ఆయూబ్‌ రాణించాలని పాక్‌ ఆశిస్తోంది. అయితే ఆ జట్టుకు నిలకడలేమి, అస్థిరత పెద్ద సమస్య. ఇటీవల ఐర్లాండ్‌ చేతిలో టీ20 మ్యాచ్‌లో ఓడింది. గ్రూప్‌ దశ దాటే అవకాశమున్న పాక్‌ ఆ తర్వాత ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.

డెబ్యూలోనే దడ పుట్టించాలని
టీ20 ప్రపంచకప్​లోకి డెబ్యూ ఇవ్వనున్న అమెరికా, కెనడాపై ఈ టోర్నీలో పెద్దగా అంచనాల్లేవు. అయితే డెబ్యూతోనే తమేంటో నిరూపించుకోవాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. భారత సంతతి ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా మారగా, కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ బ్యాటింగ్‌లో రాణిస్తూ, నాయకత్వ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.

ఇక న్యూజిలాండ్‌ మాజీ ప్లేయర్ కొరె అండర్సన్‌తో అమెరికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇంకాస్త బలోపేతమైంది. స్టీవెన్‌ టేలర్‌ కూడా ఈ సారి బ్యాటింగ్‌లో సత్తాచాటనున్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడిన అనుభవమున్న పాకిస్థాన్‌ సంతతి పేసర్‌ అలీ ఖాన్‌పై కూడా ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్‌ నిసర్గ్‌ పటేల్‌ కూడా మంచి ఫామ్​లో ఉన్నాడు.

ఇదిలా ఉండగా, పెద్ద వయస్సు గల ప్లేయర్స్​తో కెనడా కూడా సంసిద్ధంగా ఉంది. ఇందులో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆటగాళ్లు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. 37 ఏళ్ల వెటరన్‌ కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జాఫర్,39 ఏళ్ల ఆల్‌రౌండర్‌ జునైద్‌ సిద్దిఖీ, బ్యాటర్‌ ఆరోన్‌ జాన్సన్, పేసర్‌ గోర్డాన్, కలీం సానాపై జట్టు ఆశలు పెట్టుకుంది. కెనడాకు 1979, 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం కూడా ఉండటం విశేషం.

పాక్, ఇండియాకు షాకివ్వడమే లక్ష్యం!
వరుసగా ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌ ఆడనున్న ఐర్లాండ్‌ జట్టను తక్కువ అంచనా వేయలేం. కొన్నేళ్లుగా ఆటలో మంచి ఫామ్​ కనబరిచి ఆకట్టుకుంటోంది. పాకిస్థాన్‌పై టీ20లో గెలుపొందిన ఉత్సాహంతో గతంలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌పైనానూ విజేతగా నిలిచింది. దీంతో ఈ గ్రూప్‌లోనూ అమెరికా, కెనడాపై ఐర్లాండ్‌ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, భారత్‌ లేదా పాకిస్థాన్‌కు షాకిచ్చి గ్రూప్‌ దశ దాటాలన్న లక్ష్యంతోనే ఆ జట్టు టోర్నీలో అడుగుపెడుతోంది. కెప్టెన్‌ స్టిర్లింగ్, బల్‌బిర్నీ, టెక్టార్, టకర్, అడైర్, కాంఫర్‌తో జట్టు మెరుగ్గానే ఉంది. బౌలింగ్‌లో మెకార్తి, క్రెయిగ్‌ యంగ్, జోష్‌ లిటిల్‌ కీలకం కానున్నారు. ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఆడుతున్న లిటిల్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. స్పిన్నర్లు బెన్‌ వైట్, గారెత్‌ డెలాని కూడా ప్రభావం చూపేందుకు సిద్ధమయ్యారు.

2007- 2022 వరల్డ్​కప్ రికార్డులు- అన్నింట్లోనూ భారత్​దే డామినేషన్! - T20 World Cup 2024

వరల్డ్​కప్​లో యంగ్ ప్లేయర్లు- అందరి ఫోకస్ వారిపైనే- మెరిసేది ఎవరో? - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.