ETV Bharat / sports

రూ.250కోట్ల విలువైన స్టేడియం కూల్చివేత!- ఎందుకంటే? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 World Cup 2024 Stadium Dismantle : టీ20 వరల్డ్‌ కప్‌ కోసం న్యూయార్క్‌లో భారీ ఖర్చుతో తాత్కాలిక స్టేడియం నిర్మించారు. దాదాపు రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇప్పుడు దీన్ని కూల్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే?

Source ANI
T20 World Cup 2024 Stadium (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 9:00 PM IST

T20 World Cup 2024 Stadium Dismantle : టీ20 వరల్డ్‌ కప్‌ను యూఎస్‌, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ICC) చాలా చర్యలు తీసుకుంది. న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌లను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ప్రయత్నించింది. యూఎస్‌ ఏకంగా న్యూయార్క్‌, నాసావు కౌంటీలోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో 34,000 మంది ప్రేక్షకులు వీక్షించేలా సరికొత్త తాత్కాలిక స్టేడియం నిర్మించింది. దీనికి ఏకంగా రూ.250 కోట్లు వెచ్చించింది.

కానీ టీ20 వరల్డ్‌ కప్‌, అమెరికన్స్‌ను ఆకర్షించలేకపోయింది! చాలా మ్యాచుల్లో గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. మ్యాచ్‌ టైమింగ్స్‌, డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు అమెరికన్స్‌లో ఆసక్తిని తగ్గించాయి. పాక్‌- ఇండియా మ్యాచ్‌ టిక్కెట్ల ధరలు భారీగా ఉండటం కూడా విమర్శలు ఎదుర్కొంది.

  • న్యూయార్క్‌లో నేడు చివరి మ్యాచ్‌

టీ20 ప్రపంచ కప్ 2024లో యూఎస్‌ నిర్వహించే 16 మ్యాచ్‌లలో 8 నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియంలో షెడ్యూల్‌ చేశారు. రూ.250 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉపయోగించారు. ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఆడటం బ్యాటర్లకు సవాలుగా మారింది. అనూహ్యంగా బౌన్స్‌ అవుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టం మారింది. ఈ స్టేడియంలో జూన్‌ 12న యూఎస్‌ఏ, భారత్‌ చివరి మ్యాచ్‌ ఆడనున్నాయి.

అంతకు ముందు జరిగిన ఏడు మ్యాచుల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. మొదట జరిగిన శ్రీలంక వర్సెస్‌ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లకు గానీ టార్గెట్‌ అందుకోలేకపోయింది. అప్పుడే పిచ్‌ కండిషన్స్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ జరిగిన మ్యాచుల్లో ఐర్లాండ్‌ వర్సెస్‌ కెనడా మ్యాచ్‌లో కెనడా చేసిన 137 పరుగులే అత్యధికం.

  • తాత్కాలిక స్టేడియం కూల్చేస్తారా?
    న్యూయార్క్‌లోని నిర్మించిన స్టేడియం మొదటి మాడ్యులర్ స్టేడియం. అంటే దీన్ని ఈజీగా వేరు చేయవచ్చు, తిరిగి ఏర్పాటు చేయవచ్చు. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను కూడా మరో చోటుకి తరలించి వినియోగించవచ్చు. టీ20 వరల్డ్‌ కప్‌లో చివరి మ్యాచ్‌ పూర్తయ్యాక, ఈ స్టేడియాన్ని డిస్‌మాంటిల్‌ చేసే అవకాశం ఉంది.
  • న్యూయార్క్‌కి గుడ్‌ బై
    న్యూయార్క్‌, నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియంలో పిచ్‌ కండిషన్స్‌ చూసి చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. స్టార్‌ బ్యాటర్లు సైతం పరుగులు చేయడానికి కష్టపడుతుండటంతో టీ20 మజా మిస్‌ అయినట్లు కామెంట్లు చేశారు. అనూహ్యంగా బాల్‌ బౌన్స్‌ అవుతుండటంతో చాలా మంది ప్లేయర్లు స్వల్పంగా గాయపడ్డారు. జూన్‌ 12తో చివరి మ్యాచ్‌ పూర్తి కానుండటంతో క్రికెట్‌ అభిమానులు హమ్మయ్యా అనుకుంటున్నారు.

    కాగా, టీ20 మ్యాచ్‌లకు అమెరికాలో న్యూయార్క్‌, ఫ్లోరిడా, డల్లాస్‌ ఆతిథ్యం ఇస్తున్నాయి. వెస్టిండీస్‌లో గయానా, బార్బడోస్‌, ఆంటిగ్వా, ట్రినిడాడ్‌, సెయింట్‌ విన్సెంట్‌, సెయింట్‌ లూసియా నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

    హోరాహోరీగా టీ20 వరల్డ్‌ కప్ - బ్యాట్‌ను ఓడిస్తున్న బాల్‌! - T20 World Cup 2024

ఆస్పత్రి బెడ్​పై టీమిండియా స్టార్ క్రికెటర్! - అసలేం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.