ETV Bharat / sports

ఆసీస్‌ ట్రావెల్‌ రిజర్వ్‌గా పవర్‌ హిట్టర్‌- జేక్ ఫ్రేజర్​కు​ సెలక్షన్‌ కమిటీ ఛాన్స్! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 World Cup 2024 : ట్రావెల్‌ రిజర్వ్‌గా స్టార్ ప్లేయర్ జేక్‌ ఫ్రేజర్‌ను ఆస్ట్రేలియా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న జేక్‌, ఆసీస్‌ స్క్వాడ్‌తోపాటు యూఎస్‌, వెస్టిండీస్‌ రానున్నాడు. ఆ విశేషాలు మీ కోసం

Jake Fraser-McGurk
Jake Fraser-McGurk (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 10:28 PM IST

T20 World Cup 2024 : ఇప్పటి వరకు ఐపీఎల్ చాలా మంది ట్యాలెంటెడ్‌ ప్లేయర్స్‌ని అందించింది. ఐపీఎల్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేషనల్‌ టీమ్‌లో చోటు సంపాదించిన ప్లేయర్స్‌ చాలా మందే ఉన్నారు. ఈ సీజన్‌లో కూడా కొందరు యంగ్‌ ప్లేయర్స్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లిస్టులో ఉండే మొదటి పేరు ఆస్ట్రేలియన్ పవర్-హిటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్(22). అంచనాల మేరకు జేక్‌ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌ కప్‌నకు సెలక్ట్‌ కాలేదు. అయితే టీమ్‌తో పాటు రిజర్వ్ ప్లేయర్‌గా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆసీస్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా జేక్‌
ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్‌లో జేక్‌ కచ్చితంగా ఉంటాడని క్రికెట్‌ నిపుణులు భావించారు. కానీ అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా సెలెక్టర్లు ప్రధాన జట్టుతో పాటు మరో ఇద్దరు రిజర్వ్‌ ప్లేయర్‌లను సెలక్ట్‌ చేయాలని చూస్తున్నారు. ట్రావెలింగ్ రిజర్వ్‌లలో జేక్ ఉండే అవకాశం ఉందని సమాచారం. అతను కూడా యూఎస్‌, వెస్టిండీస్‌కి వెళ్తాడని చెబుతున్నారు. మరో రిజర్వ్‌ పొజిషన్‌కి స్పిన్నర్‌ని ఎంపిక చేయవచ్చు.

విల్లో టాక్‌ పోడ్‌కాస్ట్‌తో జేక్‌ మాట్లాడుతూ 'ఆసీస్‌కి మూడు ఫార్మాట్స్‌లో వార్నర్‌ బెస్ట్‌ ఓపెనర్‌. హెడ్‌ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మిచ్ మార్ష్ కూడా అంతే, అతను కెప్టెన్‌ కూడా. ఐదు, ఆరు స్థానాల్లో కూడా టిమ్ డేవిడ్, గ్రీన్‌ బలంగా ఉన్నారు. ఫర్వాలేదు, నేను వరల్డ్‌ కప్‌లో కనిపించడానికి ఇంకా సమయం ఉంది.' అని అన్నాడు. అయితే సెలెక్టర్లు మే 25 లోపు రోస్టర్‌లో జేక్‌ను చేర్చే యోచనలో ఉన్నారు. ఆ తర్వాత మార్పులు చేయాలంటే ICC ఈవెంట్ టెక్నికల్ కమిటీ అప్రూవల్‌ అవసరం అవుతుంది.

ఎంగిడి స్థానంలో ఐపీఎల్ అవకాశం
వాస్తవానికి 2023 డిసెంబరులో జరిగిన IPL వేలంలో జేక్‌ అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ నుంచి అతనికి మార్చిలో పిలుపు అందింది. లుంగి ఎంగిడి స్థానంలో జేక్‌ అవకాశం అందుకున్నాడు. DC ఆరో గేమ్‌ నుంచి బరిలో దిగిన జేక్, సంచనల ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ‌మొదటి ఏడు మ్యాచ్‌లలో నాలుగు హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. మొత్తంగా 330 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ (234.04) రికార్డు అతని పేరు మీదే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.