T20 World cup 2024 : ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇటీవల ముగిసిన 17వ సీజన్ వరకు ప్రతి సీజన్ ఆడిన ప్లేయర్స్ కొందరు ఉన్నారు. వీరిలో ధోనీ, కోహ్లీ, రోహిత్ ఇలా పలువురు ఉన్నారు. అయితే ఐసీసీ వరల్డ్ కప్‌లో ఇలాంటి ఫీట్ సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ జూన్ 2 నుంచి మొదలు కాబోతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ సీనియర్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఈ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. 2007లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఎడిషన్‌లో ఆడిన ఆటగాళ్లుగా వీళ్లు రికార్డు క్రియేట్ చేయనున్నారు.
2007లో టీ20 వరల్డ్ కప్ మొదటి ఎడిషన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీతో రోహిత్, షకిబ్ ఇద్దరూ ఇంటర్నేషనల్ టీ20లో అరంగేట్రం చేశారు. ప్రారంభ టోర్నీలో ఇద్దరూ రాణించారు. ఈ అవకాశాన్ని అద్భుతమైన కెరీర్‌కు వేదికగా మార్చుకున్నారు.
- రోహిత్ టీ20 వరల్డ్ కప్ జర్నీ
తన స్టైలిష్ బ్యాటింగ్, స్ట్రాటజీలకు మారుపేరైన రోహిత్ ఇండియా టీ20 వరల్డ్ కప్ జర్నీలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తం ఎనిమిది టీ20 వరల్డ్ కప్‌లు ఆడిన రోహిత్ 39 మ్యాచ్‌లలో 34.39 యావరేజ్, 127.88 స్ట్రైక్ రేట్‌తో 963 పరుగులు చేశాడు. మినీ ప్రపంచ కప్‌లో రోహిత్ ఏకంగా తొమ్మిది అర్ధ సెంచరీలు చేశాడు. - షకీబ్ అల్ హసన్
షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు షకిబ్ టీ20 వరల్డ్ కప్‌లో 36 మ్యాచ్‌లు ఆడాడు. 23.93 యావరేజ్, 122.44 స్ట్రైక్ రేట్‌తో 742 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతే కాదు షకీబ్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 47 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 34 మ్యాచుల్లో 39 వికెట్లతో రెండో స్థానంలో ఉన్న షాహిద్ అఫ్రిది కంటే ముందున్నాడు. - 2024 టీ20 వరల్డ్ కప్‌కి కమ్‌బ్యాక్
రోహిత్ శర్మ రెండేళ్ల విరామం తర్వాత భారత టీ20I జట్టులోకి తిరిగి వచ్చాడు. అతని అపారమైన అనుభవంతో ఇప్పుడు జట్టును నడిపిస్తున్నాడు. అలానే కంటి గాయం కారణంగా జట్టుకు దూరమైన షకీబ్, మేలో జింబాబ్వేతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో తిరిగొచ్చాడు. తమ జట్లు వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ దాటి నాకౌట్ స్టేజ్‌లోకి అడుగుపెట్టాలంటే రోహిత్, షకిబ్ ఎంతో కీలకం.
'గంటలు తరబడి మీటింగ్ రూమ్స్‌లో!- రోహిత్ కెప్టెన్సీ మంత్ర ఏంటంటే? - Rohit Sharma Captaincy Mantra
మినీటోర్నీలో టీమ్ఇండియా జర్నీ- ఆ 3ఎడిషన్లలో హార్ట్‌బ్రేక్! - T20 World Cup 2024