T20 World Cup Pakistan Journey : 2009 టీ20 వరల్డ్ కప్ విజేత అయిన పాకిస్థాన్ మరో సారి ప్రపంచ కప్‌పై కన్నేసింది. 15 ఏళ్ల నాటి కలను సాకారం చేసుకోవాలని బెస్ట్ బౌలింగ్ లైనప్ సిద్ధం చేసింది. టోర్నమెంట్ మొత్తంలో బెస్ట్ బౌలింగ్ వేయగలమనే నమ్మకంతో టీ20 వరల్డ్ కప్ 2024కు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, అసలు ఈ మెగా టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ తొలి ఈవెంట్ నుంచి ఎలా పోరాడిందో తెలుసుకుందాం.
2007 : టోర్నమెంట్ ఆరంభానికి ముందు పాకిస్థాన్ ఆడింది నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే. అస్సలు ఫేవరేట్ అనే పదానికే దూరంగా మ్యాచ్‌లు ఆరంభించిన పాక్, గ్రూపు స్టేజ్‌లో స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలను ఓడించి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. కానీ, ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చివరి వరకూ చక్కగా ఆడి శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి మ్యాచ్‌ను కోల్పోయింది పాకిస్థాన్.
2009 : టీమ్ఇండియా సూపర్ 8లోనే ఆగిపోవడం వల్ల పాకిస్థాన్‌కు అడ్డులేకుండాపోయింది. నెదర్లాండ్స్‌పై ఆడి గెలవడం వల్ల సూపర్ 8లో స్థానం సంపాదించింది. అలా సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడింది.
2010 : 2010 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ నాకౌట్ దశలోనే వాకౌట్ అవ్వాల్సి వచ్చింది. సూపర్ 8 దశకు క్వాలిఫై అయి న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో ఆడి ఓడింది. అయినప్పటికీ న్యూజిలాండ్, సౌతాఫ్రికాల కంటే బెటర్ రన్ రేట్‌తో సెమీ ఫైనల్‌కు వెళ్లినా, ఆస్ట్రేలియా దెబ్బకు ఇంటి దారి పట్టక తప్పలేదు.
2012 : పాక్ వరుసగా నాలుగోసారి సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన సందర్భమిది. గ్రూపు స్టేజీలో, సూపర్-8 దశలో ఇండియాతో మినహాయించి అన్ని మ్యాచ్‌లను గెలిచిన పాకిస్థాన్, సెమీ ఫైనల్స్‌లో శ్రీలంకతో ఆడి ఓడిపోయింది. బ్యాటర్లు చేసిన తప్పిదానికి ఫైనల్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.
2014 : ఈ టోర్నీలో సెమీ ఫైనల్స్ వరకూ కాదు కదా చివరికి గ్రూపు స్టేజితోనే సరిపెట్టుకుంది పాక్. ఐదో సారి భారత్ చేతిలో ఓడింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశకే పరిమితమై పరాభవంతో వెనుదిరిగింది.
2016 : గ్రూప్ 2లో ఆడి నాలుగో స్థానాన్ని దక్కించుకున్న పాకిస్థాన్ సూపర్ 10 వరకూ చేరుకోగలిగింది. అక్కడ బంగ్లాదేశ్‌తో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఓడింది. అలా సూపర్ 10 దశలోనే ఇంటి బాట పట్టింది.
2021 : టోర్నమెంట్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒకానొక దశలో ఇండియాను కూడా ఓడించింది. సూపర్ 12, గ్రూప్ 2 స్టేజ్‌లో విజయాలతో సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా దెబ్బకు షాక్ అయి చేతులెత్తేసింది.
2022 : పాకిస్థాన్ జారవిడుచుకున్న రెండో అవకాశం ఇది. ఇండియాతో ఓటమి తర్వాత నాలుగు సీమర్లతో ఆడింది. ఎట్టకేలకు ఫైనల్ వరకూ చేరినా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం తప్పలేదు.
టీ20 వరల్డ్ కప్ ల్లాంటి పెద్ద ఈవెంట్లలో పాకిస్థాన్ ఎప్పుడూ గట్టిపోటీ ఇస్తూనే ఉంది. మూడు సార్లు ఫైనల్ కు వెళ్లి, రెండు సార్లు మాత్రమే నాకౌట్ దశలో వెనుదిరిగి, మిగిలినన్ని సార్లు సెమీ ఫైనల్‌లో పోరాడింది. బ్యాటింగ్ లైనప్ లో ఒక్కోసారి లోటుపాట్లు కనిపించినా, బౌలింగ్ పరంగా మొదటి నుంచి మంచి విభాగంతో కొనసాగుతుంది. ప్రస్తుతం వాళ్ల జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు కూడా ఉండటం వల ఈ టోర్నమెంట్‌లో ఏ మేర రాణిస్తారో చూడాలి మరి.
న్యూయార్క్ పిచ్ వెనక కథ ఇది - ఎవరికి అనుకూలంగా ఉందంటే? - T20 World cup 2024
అన్ని టోర్నీల్లోనూ భాగమైన ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరంటే? - T20 World cup 2024