Suryakumar Injured : టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ బరిలోకి దిగిన అతడికి గాయం అయింది. అతడి చేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో మిస్టర్ 360 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులిప్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సమయానికి కూడా అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.
టీమ్ ఇండియా టెస్టు టీమ్‌లో స్థానం సంపాదిచడమే తన లక్ష్యమని ఈ మధ్యే చెప్పుకొచ్చాడు టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్. కానీ ఇప్పుడీ గాయం వల్ల బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌కు అతడు ఎంపిక కావడం కష్టంగానే కనిపిస్తుంది. పైగా ప్రస్తుతం భారత టెస్టు జట్టులో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో సూర్యకు గాయం అవ్వడం ప్రతికూలమనే చెప్పాలి. ప్రస్తుతం మిస్టర్ 360 భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి వన్డే, టెస్టుల్లో చోటు దక్కడం లేదు.
Suryakumar Test Career : కాగా, 2023 ఫిబ్రవరిలో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీతో సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో సూర్య కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ టెస్టు టీమ్‌లో చోటు దక్కలేదు. దీంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని అతడు భావించాడు.
అయితే దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా ఈ బంగ్లాదేశ్ సిరీస్‌కు కొంతమంది ప్లేయర్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు! కానీ ఇప్పుడు సూర్య గాయం అవ్వడం వల్ల అతడి టెస్ట్ కెరీర్‌పై సందేహాలు నెలకొన్నాయి.
ఇకపోతే దేశవాళీ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్‌కు సూపర్ రికార్డు ఉంది. 2010లో ముంబయి తరపున అతడు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5,628 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే 2023లో డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సమయంలోనూ సూర్య గాయపడ్డాడు. అప్పుడు దాదాపు నాలుగు నెలల తర్వాత ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇప్పుడు మరోసారి గాయపడ్డాడు.
కోహ్లీ - రూట్‌లో బెస్ట్ ఎవరు? గణాంకాలు ఏం చెబుతున్నాయ్? - Virat Kohli vs Joe Root
'అదే నా లక్ష్యం' - బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్న 'జూనియర్' పీవీ సింధు' - Badminton Player Tanvi Patri