ETV Bharat / sports

'రోహిత్ నిర్ణయం సరైందే- వాళ్లు మళ్లీ పేరెంట్స్ కానున్నారు!'

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ : తొలి మ్యాచ్​కు రోహిత్ దురం- కారణం అదేనా?

Rohit Sharma Second Baby
Rohit Sharma Second Baby (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 13 hours ago

Rohit Sharma Second Baby : 2024 బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ సిరీస్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. నవంబర్ 22న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో ఆడేందుకు భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకొని, ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. అయితే సిరీస్​లో తొలి మ్యాచ్​కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని తొలి నుంచి ప్రచారం సాగుతోంది. దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇటీవల స్పందించాడు. అయితే రోహిత్ తొలి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడా? లేదా తెలియడానికి కాస్త సమయం పట్టవచ్చని పేర్కొన్నాడు.

ఈ సిరీస్​లో ఒక మ్యాచ్​కు దూరంగా ఉండాలనుకుంటున్న రోహిత్ నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు. ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్​ కంటే ముఖ్యమైంది ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. కెప్టెన్ రోహిత్ భార్య రితికా సజ్దే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉందని అంటున్నారు. ఈ దంపతులు త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రోహిత్ ఫ్యామిలీతో కాస్త సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఆసీస్​తో జరగునున్న సిరీస్​లో తొలి టెస్టుకు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

కానీ, టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా తాజా కామెంట్స్​ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. రైనా రీసెంట్​గా ఓ ఛానెల్​తో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ మ్యాచ్​కు దూరంగా ఉండాలనుకుంటున్న రోహిత్ నిర్ణయం సరైనదే అని రైనా అన్నాడు. రోహిత్- రితికా మరోసారి పేరెంట్స్ కానున్నారని హింట్ ఇచ్చాడు.

'వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్​ తొలి మ్యాచ్​కు అందుబాటులో ఉండడం లేదేమో! వాళ్లు రెండోసారి తల్లిదండ్రులు కానున్నారేమో. అది నిజమైతే, రోహిత్ జీవితంలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం' అని రైనా అన్నాడు. కానీ రోహిత్ గైర్హజరీపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, 2015 డిసెంబర్​లో రోహిత్- రితికా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2018లో పాప (సమైరా శర్మ) జన్మించింది.

రోహిత్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం- హిట్​మ్యాన్ లేకపోతే కెప్టెన్ అతడే!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.