ETV Bharat / sports

ఇంగ్లాండ్ సిరీస్​కు ముందు శ్రీకర్ భరత్​ సెంచరీ - సెలక్టర్లకు హింట్​! - ఇంగ్లాండ్​ లయన్స్​ వర్సెస్ ఇండియా ఏ

Srikar Bharat Century : అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్ లయన్స్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శ్రీకర్ భరత్​ చెలరేగిపోయాడు. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు సాధించాడు.

Sai Sudharsan Century
Sai Sudharsan Century
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 9:13 PM IST

Srikar Bharat Century : ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు తుది జట్టులో స్థానం సంపాదించేందుకు పలువురు స్టార్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీమ్​ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్​ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌, మూడు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్​ లయన్స్‌ జట్టు ఇండియా టూర్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన మ్యాచ్‌లోని సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన భరత్‌, 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులతో చెలరేగిపోయాడు. అయితే ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఇంగ్లాండ్​ లయన్స్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 553/8 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత భారత్‌-ఏ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు స్కోర్​ చేసి ఆలౌటైంది. ఇక భారత బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(151) మంచి స్కోర్ సాధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్‌-ఎ జట్టు పుంజుకుంది. అలా మ్యాచ్​ డ్రాగా ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. ఇక టీమ్ఇండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కేఎస్​ భరత్‌తో పాటు సాయిసుదర్శన్‌(97), మనవ్‌ సుతార్‌(89) సత్తా చాటారు.

మరోవైపు ఇంగ్లాండ్​తో జరగనున్న సిరీస్‌కు సంబంధించిన తుది జట్టును ఇదివరకే మేనేజ్​మెంట్​ ప్రకటించింది. ఇందులో తొలి రెండు టెస్టుల సిరీస్‌లో స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ కోటాలో శ్రీకర్​ భరత్‌ చోటు దక్కించుకున్నాడు. ఇక అతడితో పాటు యంగ్​ వికెట్‌ కీపర్‌ ధృవ్​ జురల్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనాధికారిక టెస్టులో సెంచరీతో సెన్సేషన్​ క్రియేట్ చేసిన శ్రీకర్ భరత్‌కు వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్​ క్రిటిక్స్​ అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.