SRH VS GT IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు (మార్చి 16)న సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ పోరు కోసం అటు క్రికెట్ లవర్స్‌తో పాటు ప్లేయర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ జట్టు గట్టిగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించనుందని సమాచారం.
ఇప్పటికే ఉప్పల్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో జోరు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో స్టేడియం ప్రాంతంలోనూ కూడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను హైదరాబాద్ జట్టు ఓడిస్తే ఇక సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చినట్లే. అప్పుడు దిల్లీ, లఖ్‌నవూ జట్లు ఇంటిముఖం పట్టినట్లే అని విశ్లేషకుల మాట. అదే జరిగితే చివరి స్థానం కోసం చెన్నై - బెంగళూరు జట్లు పోటీపడాల్సి ఉంటుంది.
అయితే ఈ రోజు మ్యాచ్ ఆగిపోయి ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తే, హైదరాబాద్ (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అంతే కాకుండా పంజాబ్‌తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలిస్తే ఇక ఆ జట్టు టాప్ 2 పొజిషన్‌ను చేజిక్కించుకునే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా మీద ఓడిపోతేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇక గుజరాత్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమవుతుంది.
మరోవైపు చెన్నై - బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. ఆ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. బెంగళూరు ఇక ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి చెన్నై భారీ తేడాతో ఓడితే తప్ప బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్‌లు ఉన్నాయి.
'చెన్నైకి ఆ క్రేజ్ వచ్చింది ధోనీ వల్లనే - ఈ విషయంలో జడ్డూ ఫీలయ్యాడు' - MS Dhoni CSK
లఖ్‌నవూపై దిల్లీ విజయం - ఈ రెండు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - IPL 2024