SL vs NZ Kamindu Mendis Century Record : లంక క్రికెటర్ కమిందు మెండిస్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో శతకం బాదిన కమిందు తన పేరిట ఐదు రికార్డులను రాసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 173 బంతుల్లో 114 రన్స్ సాధించాడు.
లంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చాడు కమిందు. జట్టు స్కోరు 300+(86 ఓవర్లు) వరకు క్రీజులో ఉండి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో అతడు సాధించిన ఐదు రికార్డులు ఏంటో తెలుసుకుందాం.
తొలి శ్రీలంక క్రికెటర్‌గా - ఏడు టెస్టుల్లో అంటే ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం అర్ధ శతకం బాదాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్ అతడే.
ఆసియా క్రికెటర్లలో టాప్ - మెండిస్ ఇప్పటివరకు ఏడు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడాడు. మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లో 809 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ సగటు 80.90. కనీసం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్‌గా ఉన్నాడు. భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 68.53 సగటుతో ఉన్నాడు.
Kamindu Mendis continues to make a strong impression for Sri Lanka with another vital knock in Galle 👏#SLvNZ | #WTC25https://t.co/AVFhdo98od
— ICC (@ICC) September 18, 2024
డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యుత్తమ సగటు - ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌లో కనీసం 10 ఇన్నింగ్స్ కన్నా ఎక్కువగా ఆడిన బ్యాటర్లలో మెండిస్‌దే అత్యుత్తమ యావరేజ్. ప్రస్తుతం మెండిస్ సగటు 80.90గా ఉంది. రెండో సీజన్‌లో కేన్ విలియమ్సన్ 75.2 సగటుతో పరుగులు చేశాడు. ఇప్పుడు మెండిస్ మూడో సీజన్‌లో కేన్‌ను అధిగమించాడు.
దిముత్‌తో సమంగా - ఒకే డబ్ల్యూటీసీ సీజన్‌లో లంక బ్యాటర్ దిముత్ కరుణరత్నె ఇప్పటివరకు ఎక్కువ శతకాలు బాదిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఇప్పుడు అతడితో సమంగా మెండిస్ వచ్చాడు. దిముత్ 2019-21లో నాలుగు శతకాలు బాదాడు. మెండిస్ 2023-25 సీజన్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించాడు. మరో శతకం బాదితే అతడే టాప్‌లో ఉంటాడు.
దిగ్గజ క్రికెటర్‌తో సమంగా - శ్రీలంక బ్యాటర్ మెండిస్ 11 ఇన్నింగ్స్‌లో నాలుగు శతకాలు బాదాడు. ఇందులో బంగ్లాదేశ్‌పై రెండు, ఇంగ్లాండ్‌పై ఒకటి, న్యూజిలాండ్‌పై ఇంకోటి నమోదు చేశాడు. ఈ క్రమంలో వేగంగా నాలుగు సెంచరీలు బాదిన తొలి లంక బ్యాటర్‌గా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా తన మొదటి నాలుగు శతకాలను 11 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. దీంతో మెండిస్ బ్రాడ్‌మన్ సరసన మెండిస్ చేరాడు.
632 రోజుల తర్వాత 'టెస్ట్'కు సిద్ధమైన పంత్ - గంభీర్ ఏమన్నాడంటే? - IND VS BAN Pant Test Cricket