ETV Bharat / sports

ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే జట్టుకు అదనపు బలం వచ్చినట్లే :శుభ్‌మన్ గిల్ - Shubman Gill Impact Player Rule - SHUBMAN GILL IMPACT PLAYER RULE

Shubman Gill Impact Player Rule : లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ల గురించి సెస్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ విశేషాలు మీ కోసం.

Shubman Gill Impact Player Rule
Shubman Gill Impact Player Rule
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 11:57 AM IST

Shubman Gill Impact Player Rule : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఈ పోరులో చేధనలో విఫలమై కేవలం 4 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది గుజరాత్. దీంతో పాయింట్ల పట్టికలో ఒక స్థానం కిందకు పడిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఇలా స్పందించారు.

"జట్టుకు అధిక స్కోరును చేర్చడంలో ఇంపాక్ట్ ప్లేయర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. వికెట్లు పడిపోతున్నా అతడు ఉన్నాడనే నమ్మకం మిగిలిన వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని చివరి వరకూ పోరాడేలా చేస్తుంది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో మేము 200 - 210 పరుగుల మధ్యనే కట్టడి చేస్తామని అనుకున్నాం. చివరి 2 ఓవర్లలో కొన్ని అదనపు పరుగులు కూడా చేశాం. ఛేజింగ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లక్ష్యం మనం చేధించగలమా? లేదా? అని ముందుగా తెలుసుకోవాలి. దానిని అమలుపరచడం కూడా అంతేముఖ్యం. బౌలర్లకు గ్రౌండ్ అనుకూలించకపోతే యార్కర్లు వేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. మేం బాగానే ఆడామని అనుకుంటున్నాం. చివరిలో అసంతృప్తికి గురి కావాల్సి వచ్చింది. గేమ్ ఆసాంతం గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాం" అని గిల్ వెల్లడించాడు.

ఇక బుధవారం జరిగిన మ్యాచ్​లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. పంత్ 43 బంతుల్లో 88 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. మరో దిల్లీ ప్లేయర్ అక్సర్ పటేల్ కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 43 బంతుల్లో 66 పరుగులు సాధించారు. ఆరంభంలో పటిష్ఠంగా కనిపించిన గుజరాత్ బౌలర్లు క్రమంగా పట్టు కోల్పోవడం వల్ల రిషబ్ - అక్షర్​ ల జోడీ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది.

లక్ష్య చేధనలో విఫలమైన గుజరాత్ చివరి వరకూ పోరాడి 4పరుగుల తేడాతో ఓటమికి గురైంది. తొమ్మిది మ్యాచ్ లలో దిల్లీకి ఇది నాలుగో విజయం కాగా, గుజరాత్ సైతం 9 మ్యాచ్ లు ఆడి ఐయిదో పరాజయాన్ని మూటగట్టుకుంది.

'ఆ ఒక్క తప్పే జట్టు ఓటమికి కారణమైంది' - శుభ్‌మన్ గిల్ - GT VS PBKS IPL 2024

తెవాటియా, గిల్​ మెరుపులు - మ్యాచ్​ విన్నర్​గా గుజరాత్​ - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.