Shreyanka Patil Asia Cup 2024 : ఆసియా కప్‌లో తొలి విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా మహిళల జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఆసియాకప్‌కు దూరమైంది.
ఎడమ చేతి నాలుగో వేలికి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌నకు శ్రేయాంక పాటిల్ దూరమైందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడు శ్రేయాంక పాటిల్ స్థానంలో తనూజా కన్వర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్వర్‌కు భారత జట్టులో తొలిసారి స్థానం దక్కడం విశేషం.
దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో శ్రేయాంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3.2 ఓవర్లలో 4.2 ఎకానమీతో కేవలం 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మంచి స్పిన్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేస్తూ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రీలంక పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న వేళ శ్రేయాంక ఆసియా కప్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కావడం టీమ్ఇండియాకు ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
మహిళల ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలి విజయంతో శుభారంభం చేసింది. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. దంబుల్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో పాక్‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 108 పరుగులకే పరిమితమైంది.
ఇక పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22*) కాస్త పోరాడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/20), శ్రేయాంక పాటిల్ (2/14), రేణుకా సింగ్ (2/14) రాణించారు.
పూజా వస్త్రాకర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 14 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (40) అద్భుత ఇన్నింగ్స్ ఆడి బౌండరీలతో రెచ్చిపోయారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 85 పరుగుల భాగస్వామ్యంతో భారత్ శుభారంభం అందించి విజయం ఖాయం చేశారు. దీంతో భారత్ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్లు చేతిలో ఉండగానే, 35 బంతులు మిగిలి ఉండగానే పాక్‌పై భారత్ విజయం సాధించింది. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆసియా కప్‌లో నేపాల్ శుభారంభం- UAEపై గ్రాండ్ విక్టరీ
స్మృతి, షఫాలీ మెరుపులు- పాక్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ - Womens Asia Cup 2024