Olympic Medal After 12 Years : ఒలింపిక్స్ పతకం కోసం అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తారు. అయితే కొన్నిసార్లు మెరుగ్గా ఆడినప్పటికీ పలు కారణాల వల్ల అనర్హతకు గురై పోటీలకు దూరమవుతుంటారు. కానీ, ఇక్కడ ఓ అథ్లెట్‌కు ఒలింపిక్ పతకం దక్కాలని రాసి ఉందేమో! దశాబ్ద కాలానికి ఆమెకు పతకం అందనుంది. అలా ఎందుకు జరిగింది? ఆమె ఎవరు? తెలుసుకుందాం.
అమెరికా అథ్లెట్ షానన్ రౌబరీ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొంది. ఈ క్రీడల్లో ఆమె మహిళల 1500 మీటలర్ల పరుగు పందెంలో పోటీ పడింది. అయితే ఆ పోటీల్లో ఆమెకు నిరాశే మిగిలింది. ఫైనల్లో షానన్ ఆరో స్థానానికి పరిమితమై పతకం దక్కించుకోలేకపోయింది. దీంతో అప్పట్లో షానన్ తీవ్రంగా బాధపడిందట.
అయితే ఆ పోటీలు ముగిసిన కొన్ని రోజులకు ఓ చీకటి కోణం బయట పడింది. ఆ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లలో అనేక మంది డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. దీంతో 2012 ఒలింపిక్స్ రన్నింగ్ రేస్ విశ్వ క్రీడల చరిత్రలో అత్యంత దారుణమైన పోటీగా నిలిచింది. ఆ ఫైనల్స్‌లో 13 మంది పాల్గొనగా అందులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ విన్నర్స్ సహా మొత్తం ఐదుగురిపై అనర్హత వేటు పడింది.
అలా దర్యాప్తు, శాంపిళ్ల పరీక్షల తర్వాత అనేక మందిపై వేటు పడింది. దీంతో షానన్ స్థానం క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. తాజాగా ఆ ఫైనల్లో సిల్వర్ మెడల్ దక్కించుకున్న రష్యా అథ్లెట్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) ఇటీవల 10ఏళ్ల నిషేధం విధిస్తూ తీర్పూనిచ్చింది. దీంతో షానన్ మూడో స్థానానికి ఎగబాకింది. ఫలితంగా కాంస్యం ముద్దాడేందుకు సిద్ధమైంది.
“I just couldn’t make peace with it ... We were competing in a time that was unfortunately so dirty."
— George Ramsay (@georgeramsay6) September 26, 2024
interview with @ShannonRowbury about being set to receive her first Olympic medal, 12 years after she raced in London.https://t.co/huHD84Eyve
కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రెజ్లింగ్ 53కేజీల విభాగంలో అదిరే ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు పతకం ఖాయమైంది. అయితే అనూహ్యంగా ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురైంది.
ఒలింపిక్స్ పిస్టల్ ధర రూ.కోటి! - మను బాకర్ రియాక్షన్ ఇదే - Manu Bhaker Reacted on PIstol Price