ETV Bharat / sports

'అతడి భద్రత మాకు సంబంధించినది కాదు' - షకిబ్​కు షాకిచ్చిన బీసీబీ - BCB ON SHAKIB AL HASAN SECURITY

Shakib Al Hasan Security : టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ సీనియర్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ తన భద్రతపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై బీసీబీ చీఫ్​ ఫరూఖీ అహ్మద్‌ స్పందించారు. ఏం అన్నారంటే?

source Associated Press
Shakib Al Hasan (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 27, 2024, 9:42 AM IST

Shakib Al Hasan Security : టీ20లకు బంగ్లాదేశ్‌ సీనియర్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తన భద్రతపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. "బంగ్లాదేశ్‌కు వెళ్లడం సమస్యేమి కాదు కానీ అక్కడి నుంచి రావడమే కష్టం. నా ఫ్రెండ్స్​, ఫ్యామిలీ మెంబర్స్​ నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు" అని షకిబ్​ అన్న కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అలానే సొంత దేశంలో తన చివరి టెస్టు ఆడాలని ఉందని కూడా చెప్పాడు షకీబ్​. అయితే ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు చీఫ్ ఫరూఖీ అహ్మద్‌ స్పందించారు. షకిబ్​కు భద్రత కల్పించే బాధ్యత తమ చేతుల్లో లేదని పేర్కొన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని తెలిపారు.

"‘షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు. బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను కల్పించదు. ఎందుకంటే షకిబ్ భద్రత విషయమై ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు రియాక్ట్ అవుతాయి. పోలీస్, రాబ్ (ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్) తరహాలో బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు కదా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వానిదే బాధ్యత. ఈ విషయంలో బీసీబీ ఎలాంటికి సంబంధం లేదు." అని వెల్లడించారు.

క్లీన్​స్వీప్​ లక్ష్యంగా - రెండో టెస్ట్​కు సిద్ధమైన భారత్​! - IND VS BAN Second Test

టెస్టుల్లో బంతిది కూడా కీ రోల్ - టీమ్ఇండియా ఏ బాల్ వాడుతుందో తెలుసా? - Types Of Cricket Balls

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.