Sarfaraz Khan Test Debut: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌తో 26 ఏళ్ల భారత యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే, సర్ఫరాజ్‌కు టెస్టు క్యాప్ అందించాడు. దీంతో సర్ఫరాజ్ టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున ఆరంగేట్రం చేసిన 311వ ప్లేయర్‌గా నిలిచాడు.
అయితే సర్ఫరాజ్ డెబ్యూ క్యాప్ అందుకున్న సమయంలో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది. కుమారుడు జాతీయ జట్టులో ఆరంగేట్రం చేస్తున్న సందర్భంగా సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంలో ఆనందబాష్పాలతో తన కుమారుడు అందుకున్న డెబ్యూ క్యాప్‌ను నౌషద్ ఖాన్ ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న సర్ఫరాజ్ భార్య కూడా ఎమోషనలైంది. ఈ సంఘటన మైదానంలో ప్రేక్షకులతోపాటు ప్లేయర్లందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇదే మ్యాచ్‌లో సర్ఫరాజ్‌తో పాటు ధ్రువ్ జురెల్కూడా అరంగేట్రం చేశాడు. మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్ జురెల్‌కు డెబ్యూ క్యాప్ అందజేశాడు.
నమ్మినందుకు థాంక్స్: సర్ఫరాజ్‌కు టీమ్ఇండియా పిలుపు అందగానే తన తండ్రి నౌషద్ ఖాన్ బీసీసీఐ థాంక్స్ చెప్పాడు. ఈ మేరకు అప్పుడే ఓ వీడియో రిలీజ్ చేశాడు.'ఈరోజు సర్ఫారాజ్ టీమ్ఇండియా ఎంపికయ్యాడు. అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్న సెలక్టర్లకు, బీసీసీఐకి నా కృతజ్ఞతలు. అతడు అద్భుతంగా ఆడాలని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిద్దాం'అని సర్ఫరాజ్ జట్టులోకి ఎంపికైన రోజు నౌషద్ ఖాన్ అన్నాడు.
Sarfaraz First Class Career: ఫస్ట్ క్లాస్ కెరీర్లో సర్ఫరాజ్తు మెరుగైన రికార్డే ఉంది. 45 మ్యాచ్‌ల్లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
స్టోక్స్@100: ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 100వ టెస్టు ఆడుతున్నాడు. దీంతో స్టోక్స్ టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన 76వ ప్లేయర్‌గా నిలిచాడు. కాగా, ఇంగ్లాండ్ తరఫున స్టోక్స్ ఈ మైలురాయి అందుకున్న 16వ ఆటగాడు. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా ఇంగ్లాండ్‌కు కీలకంగా మారాడు. స్టోక్స్ ఇప్పటివరకు టెస్టుల్లో 6251 పరుగులు చేసి, 197 వికెట్లు పడగొట్టాడు.
'నా కొడుకుపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్'- సర్ఫరాజ్ తండ్రి ఎమోషనల్