ETV Bharat / sports

సర్ఫరాజ్ జెర్సీ 'నెం.97'- దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా? - sarfaraz khan debut video

Sarfaraj Khan Jersey No: రాజ్​కోట్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టులో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో అతడు నెం.97 జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. మరి ఈ నెంబర్ వెనుకున్న స్పెషల్ ఏంటంటే?

Sarfaraj Khan Jersey No
Sarfaraj Khan Jersey No
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 3:42 PM IST

Updated : Feb 15, 2024, 5:12 PM IST

Sarfaraj Khan Jersey No: 26 ఏళ్ల యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​తో​ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే, సర్ఫరాజ్​కు టెస్టు క్యాప్ అందించాడు. దీంతో సర్ఫరాజ్ టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున ఆరంగేట్రం చేసిన 311వ ప్లేయర్​గా నిలిచాడు. ఇక నెం.97 జెర్సీ ధరించి సర్ఫరాజ్ బరిలోకి దగనున్నాడు. అయితే తన జెర్సీపై ఇదే నెంబర్ ఉంచుకోడానికి ఓ స్పెషల్ కారణం ఉంది అదేంటంటే.

సర్ఫరాజ్ తండ్రి పేరుకు గుర్తుగా నెం.97 ఎంపిక చేసుకున్నాడట. అతడి తండ్రి పేరు నౌషద్ ఖాన్. అయితే ఈ పేరును విడదీస్తే 'నౌ సాత్' అవుతుంది. హిందీలో నౌ అంటే 9, సాత్ అంటే 7 అని అర్థం. దీంతో అతడు 97 నెంబర్​ను సెలెక్ట్ చేసుకున్నాడట. అయితే సర్ఫరాజ్ నెం.97 జెర్సీ ధరించడం ఇదేం కొత్త కాదు. అండర్- 19, ఐపీఎల్​లోనూ ఇదే నెంబర్ జెర్సీ ధరించాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్​ ఆడడం వల్ల ఇది వైరలైంది.

ఇక మ్యాచ్​కు ముందు సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్​ అందుకోగానే అతడి తండ్రి, భార్య ఎమోషనలయ్యారు. కన్నీళ్లతో సర్ఫరాజ్​ను హత్తుకొని, అతడి టెస్టు క్యాప్​ను ముద్దాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కెరీర్​లో బెస్ట్ అచీవ్​మెంట్, కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

తమ్ముడు కూడా అదే బాటలో: సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్​ 2024 అండర్- 19 టీమ్ఇండియా జట్టులో సభ్యుడు. అతడు కూడా తండ్రి పేరుగు గుర్తుగా అండర్- 19 టోర్నమెంట్​లో నెం.97 జెర్సీనే ధరించడం విశేషం. ఇక ముషీర్ ఖాన్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రాణించాడు. లీగ్ దశలో ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ముషీర్ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ సహా 118 పరుగులు బాదాడు. కాగా, ఫైనల్​లో ఆస్ట్రేలియాతో తలపడ్డ యువ భారత్ ఓటమి చవిచూసింది.

టెస్టుల్లో సర్ఫరాజ్ డెబ్యూ- క్యాప్​ను ముద్దాడుతూ తండ్రి ఎమోషనల్

ఇషాన్​పై జై షా ఫైర్- వాళ్లకు కూడా వార్నింగ్!

Last Updated : Feb 15, 2024, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.