Sameer Rizvi Age Fraud: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. మంగళవారం గుజరాత్ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్క్ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన రిజ్వీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో కెరీర్‌లో తొలి బంతినే సిక్సర్ బాదిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. అయితే తొలి మ్యాచ్‌తోనే క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న రిజ్వీని ఓ వివాదం చుట్టుముట్టింది. తన వయసు తప్పుగా చూపాడంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
సమీర్ వయసెంత?: అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మంది క్రికెటర్లు తమ వయసును తక్కువ చేసి చూపించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ నుంచి చాలామంది ఆటగాళ్లు ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సమీర్ రిజ్వీ కూడా తన వయసును తక్కువ చేసి చూపాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. '19ఏళ్ల వయసులో నా ఫ్రెండ్ అండ్ సమీర్ రిజ్వీ కలిసి క్రికెట్ ఆడారు. ఇప్పుడు నా ఫ్రెండ్ వయసు 24 ఏళ్లు కాగా, సమీర్ ఇంకా 20ఏళ్ల దగ్గరే ఉన్నాడు' అని పోస్ట్‌లో ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనికి 2019 అండర్- 19 ఆసియా కప్‌లో ఆడిన సమీర్ పోస్ట్‌ను అటాచ్ చేశాడు. అయితే ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ప్రారంభించిన సమయంలో సమీర్‌పై ఇలాంటి ఆరోపణలు అతడి ఇమేజ్ను డ్యామేజ్ చేసేవే! మరి ఈ విషయంపై ఎక్కడా ఎవరు స్పందించలేరు.
ఎవరీ సమీర్ రిజ్వీ?: సమీర్ రిజ్వీ ఉత్తర్ ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తర్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్‌లో కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. ఈ క్రమంలోనే తన దశ తిరిగిపోయింది. 2023 డిసెంబర్లో జరిగిన వేలంలో చెన్నై సీఎస్కే రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై - వరుసగా రెండో విజయం - CSK vs GT 2024 IPL