Same Jersey Number In Cricket: స్పోర్ట్స్ స్టార్‌ల పేర్లుకే కాదు వాళ్ల జెర్సీ నంబర్‌లకి కూడా క్రేజ్ ఉంటుంది. ప్లేయర్స్ ఆ నంబర్‌లు సెలక్ట్ చేసుకోవడం వెనుక మంచి స్టోరీలు, బిగ్ మైల్‌స్టోన్లు ఉంటాయి. ఉదాహరణకు క్రికెట్ ప్రపంచంలో నంబర్ 10 అనగానే సచిన్, 7 అనగానే ధోని గుర్తుకొస్తారు. ఈ లెజెండ్స్ అందించిన సేవలకు గుర్తుగా బీసీసీఐ ఈ జెర్సీ నంబర్‌లు ఇక ఎవ్వరికీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే వివిధ దేశాలకు చెందిన కొందరు ప్లేయర్‌లు ఒకే జెర్సీ నంబర్‌లు ధరిస్తుంటారు.
ఐసీసీ టోర్నమెంట్స్‌లో వీరిని చూసి కొందరు ఆశ్చర్యపోతుంటారు. క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇలాంటి ఒకే జెర్సీ నంబర్‌తో చాలా మంది ఆటగాళ్లే కనిపించారు. రానున్న టీ20 వరల్డ్ కప్‌లోనూ కనిపించవచ్చు. ఇంతకీ ఆ ప్లేయర్‌లు, కామన్ జెర్సీ నంబర్‌లు ఏవో చూద్దాం.
- నెం. 45: నెంబర్ 45 అనగానే అందరికీ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గుర్తుకు వస్తాడు. రోహిత్‌పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, వెస్టిండీస్ క్రిస్ గేల్ కూడా ఇదే నంబర్ జెర్సీ ధరిస్తున్నాడు.
- నెం. 10: ప్రస్తుతం నంబర్ 10 జెర్సీని పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ షా ఆఫ్రిది, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ వినియోగిస్తున్నారు.
- నెం. 18: ప్రపంచ క్రికెట్‌లో 18 అంటే ఎక్కువ మంది విరాట్ కోహ్లీ గుర్తొస్తాడు. ఇదే నంబర్ జెర్సీని న్యూజిలాండ్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్, శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక, ఇంగ్లాండ్ ప్లేయర్ మొయిన్ అలీ ధరిస్తున్నారు. తాజాగా ఆఫ్గానిస్థాన్‌కు చెందిన క్రికెటకర్ ఇబ్రహీం జద్రాన్ కూడా ఈ క్లబ్‌లో చేరాడు.
- నెం. 1: ఈ నంబర్‌ని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వాడుతున్నాడు. అలాగే ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీబుల్లా జద్రాన్ ధరిస్తున్నాడు.
- నెం. 88: న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ జంపా 88 జెర్సీని వాడుతున్నారు.
- నెం. 56: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 56 జెర్సీ ఉపయోగిస్తున్నారు.
- నెం. 8: భారత్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఆఫ్గానిస్థాన్ చెందిన రహమత్ షా ఈ జెర్సీ వినియోగిస్తున్నారు.
- నెం. 77: ఆస్ట్రేలియా ప్లేయర్ సీన్ అబాట్, భారత్ డైనమిక్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 77 జెర్సీ నంబర్ వినియోగిస్తున్నారు.
- నెం. 69: ఈ జెర్సీ నంబర్‌ని న్యూజిలాండ్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్, శ్రీలంకకు ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ వాడుతున్నారు.
సర్ఫరాజ్ జెర్సీ 'నెం.97'- దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా?
ప్లేయర్లకే కాదు- జెర్సీ నంబర్లకూ రిటైర్మెంట్- మీకు ఈ విషయం తెలుసా?