Sakshi Singh On Dhoni Retirement: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. క్రికెట్లో భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీ కూడా ఒకడు. అలాంటి ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజును ఎవరూ మర్చిపోలేరు. చడీచప్పుడు లేకుండా 2014లో టెస్టు క్రికెట్‌కు దూరమయ్యాడు ధోనీ. అయితే అప్పుడు అలా నిర్ణయం తీసుకోవడంపై ధోనీ భార్య సాక్షి స్పందించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. కుటుంబానికి తగినంత సమయాన్ని ఇవ్వడానికి తనే ధోనీని టెస్టుల నుంచి తప్పుకోవాలని కోరినట్లు సాక్షి చెప్పింది.
ఫ్యామిలీతో కాస్తాయినా సమయం గడపాలి అంటే ఏదో ఒక ఫార్మాట్ నుంచి వైదొలగాలని తాను చెప్పానని పేర్కొంది. ఇప్పటికీ చాలామంది ధోనీ కోసం నువ్వు త్యాగం చేశావంటూ తనపై జాలి చూపిస్తారని, కానీ తమ మధ్య ప్రేమ ఉన్నప్పుడు అందులో త్యాగం, సర్దుకుపోవటం అన్న మాటలకు అవకాశమే లేదంది సాక్షి. 'ధోనీకి క్రికెట్ ముఖ్యం, ధోనీ నాకు ముఖ్యం కాబట్టి అది త్యాగం కాదు ప్రేమ' అని చెప్పింది. ధోని టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు నెలల తర్వాత వారి కుటుంబంలోకి చిన్నారి (జీవా సింగ్)ని స్వాగతించినట్టు గుర్తు చేసుకుంది.
ఇక 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ బాధ నుంచి భారత క్రికెట్ అభిమానులు నెమ్మడిగా కోలుకుంటున్న సమయంలో ఎంఎస్ ధోనీ మరో ఓ బాంబ్ పేల్చాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. కనీసం అభిమానులకు ఫేర్ వెల్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన స్టైల్లో రిటైర్మెంట్ ఇచ్చాడు.
2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఎంఎస్ ధోనీ వన్డేల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 2005లో శ్రీలంకపై తొలి టెస్టు ఆడిన మహి 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 జులై 19న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టుకు తొలిసారి ధోనీ నాయకత్వం వహించాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు తొలిసారి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఐపిఎల్ 2024లో ధోనీ ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలనుంచి వైదొలిగిన ధోనీ ఈ సీజన్‌లో సీనియర్ ఆటగాడిగా, రుతురాజ్‌కు పెద్దన్నగా కొత్త పాత్ర పోషిస్తునాడు.
'ఏంటి జడ్డూ ఇలా చేశావ్' - ధోనీ ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన ఆల్‌రౌండర్! - Ravindra Jadeja CSK
'నేను ఇక్కడ ఉన్నది అభిమానులను అలరించేందుకే' -ధోనీ ఓల్డ్ ట్వీట్ వైరల్! - Dhoni CSK Tweet