Sachin Tendulkar Vinesh phogat: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వివాదాస్పద రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ మద్దతు తెలిపాడు. దీనికి సంబంధించి శుక్రవారం సచిన్, సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. దీనికి 'టైమ్ ఫర్ అంపైర్స్ కాల్' అనే టైటిల్ పెట్టాడు. వినేశ్ రజత పతకానికి అర్హురాలని సచిన్ అభిప్రాయపడ్డాడు.
'ప్రతి క్రీడకు నియమాలు ఉంటాయి. ఆ నియమాలను సందర్భానుసారంగా చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మళ్లీ పరిశీలించాల్సిన వస్తుంది. వినేశ్ ఫోగాట్ ఫైనల్స్‌కు ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా అర్హత సాధించింది. ఆమె అధిక బరువుతో డిస్‌క్వాలిఫై అయింది ఫైనల్స్‌కి ముందు మాత్రమే. కానీ ఆమె సిల్వర్ మెడల్‌ని లాక్కోవడంలో లాజిక్, స్పోర్టింగ్ సెన్స్ లేవు' అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
పెర్ఫార్మెన్స్ మెరుగు పర్చుకునేందుకు డ్రగ్స్ ఉపయోగిస్తే అనర్హత వేటు వేయడంలో అర్థం ఉందని సచిన్ పేర్కొన్నాడు. అయితే వినేశ్ చాలా చక్కటి ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరుకుందని, ఆమె సిల్వర్ మెడల్‌కి అర్హురాలని సచిన్ అభిప్రాయపడ్డాడు.
ట్వీట్‌కి భారీ రెస్పాన్స్
సచిన్ ట్వీట్‌కి కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ట్వీట్‌ని కేవలం 1.30 గంటల్లో 4.34 లక్షల మందికిపైగా చూశారు. 26 వేల మందికిపైగా లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు సచిన్ వాదనను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
#VineshPhogat #Paris2024 #Olympics @WeAreTeamIndia pic.twitter.com/LKL4mFlLQq
— Sachin Tendulkar (@sachin_rt) August 9, 2024
కోర్ట్‌లో అప్పీల్
వినేశ్ ఫోగట్ తన అనర్హతపై స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్ట్‌లో అప్పీల్ చేసింది. షేర్డ్ సిల్వర్ మెడల్ అందజేయాలని కోరింది. దీనిపై పారిస్‌లో విచారణ జరుగుతోంది. ఒలింపిక్ క్రీడలు ముగిసేలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగం ఫైనల్స్‌కి ముందు వినేశ్ ఫోగట్ 100గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. ఫైనల్స్ అవకాశం లేకుండా, ఏ పతకం లేకుండా వినేశ్‌ని ఇంటకి పంపడంపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతర్జాతీయ రెజ్లింగ్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది.