Ruturaj Gaikwad Net Worth : చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో సీఎస్కే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. రుతురాజ్ కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఆకట్టుకుంటున్నాడు. 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతున్న గైక్వాడ్, ధోని కెప్టెన్సీ వదులుకోవడం వల్ల జట్టు పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్‌గా ఎంపిక కాకముందు రుతురాజ్ సీఎస్కే తరఫున మొత్తం 52 మ్యాచ్‌లు ఆడాడు. ఇంతకీ గైక్వాడ్ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడు? అతడి నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌తో సీజన్‌ను ప్రారంభించడం ఇదేం మొదటిసారి కాదు. 2022లో రవీంద్ర జడేజా మొదట కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరుస వైఫల్యాలు ఎదురుకావడం వల్ల తిరిగి ధోనీనే జట్టును నడిపించాడు. ప్రస్తుత సీజన్‌లో గైక్వాడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌పై విజయాలు అందుకున్నాడు. ఆర్సీబీ మ్యాచ్‌లో 15 పరుగులకే వెనుదిరిగినా, గుజరాత్‌పై 36 బంతుల్లో 46 పరుగులు చేశాడు. సీఎస్కే కొత్త సారథి మొదటి కప్పు గెలిస్తే, అతని ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. రానున్న వేలంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఐపీఎల్ ఆదాయం
Ruturaj IPL Income : 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గైక్వాడ్ తొలి సీజన్‌లో రూ.20 లక్షలు సంపాదించాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనసాగించినప్పుడు ఆదాయం భారీగా పెరిగింది. స్పోర్ట్స్ న్యూస్ వెబ్‌సైట్ స్పోర్ట్స్ కీడా ప్రకారం ప్రస్తుతం అతడు సుమారు రూ.6 కోట్లు సంపాదిస్తున్నాడు. 2021 జూలైలో శ్రీలంకపై ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. GoKratos, Games 24X7, Social Offline, Electro Plus వంటి అనేక బ్రాండ్‌లను ఎండార్స్ చేస్తున్నాడు.
బీసీసీఐ కాంట్రాక్ట్
ఈ సంవత్సరం ప్రారంభంలో బీసీసీఐ విడుదల చేసిన 2023-2024 సీజన్ ప్లేయర్ కాంట్రాక్ట్‌ల ప్రకారం, రుతురాజ్ గైక్వాడ్‌కు గ్రేడ్-సీ కాంట్రాక్ట్ లభించింది. అతనికి రూ.కోటి వార్షిక వేతనం లభిస్తుంది. తిలక్ వర్మ, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా అదే కాంట్రాక్టును పొందారు.
దేశీయ క్రికెట్
బీసీసీఐ, ఐపీఎల్, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల సంపాదనతో పాటు, రుతురాజ్ గైక్వాడ్ దేశీయ క్రికెట్ నుంచి కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఈ ఏడాదిలో నెలకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇంతకీ గైక్వాడ్ నెట్‌వర్త్ ఎంత?
Gaikwad Net Worth : స్పోర్ట్స్ కీడా, పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ నెట్‌వర్త్ దాదాపు రూ.36 కోట్లు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ 2021లో రూ.6 కోట్లకు గైక్వాడ్‌ను కొనుగోలు చేసింది. ఈ కాంట్రాక్టును అలానే పొడిగించింది. గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో కూడా అతడు ఇదే మొత్తానికి అమ్ముడుపోయాడు. ఈ సీజన్‌లో కూడా అతడిని రూ.6కోట్లకు దక్కించుకుంది సీఎస్కే.
మయాంక్ మెరుపు వేగంతో లఖ్‌నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024
ఐపీఎల్‌లో నయా స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మయాంక్ యాదవ్? - Who is Mayank Yadav