Ruturaj Gaikwad IPL Toss: క్రికెట్ మ్యాచ్‌లో టాస్‌ది మేజర్ రోల్ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో కాస్త ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. అందుకే తన టీమ్మేట్స్తో కలిసి డగౌట్లో టాస్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుతురాజ్ టాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
'గేమ్‌లో టాస్ ఇంపార్టెంట్. అది నాకు తెలుసు. కానీ అది మన కంట్రోల్ (చేతుల్లో) లేనిది. అందుకే నేను 7- 8 మంది మా టీమ్మేట్స్తో టాస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్‌లో అందరితోనూ టాస్‌లో నేను గెలుస్తున్నా. దీంతో పుల్ కాన్ఫిడెంట్‌గా మ్యాచ్‌లో టాస్కు వెళ్తే అక్కడ మాత్రం ఓడిపోతున్నా. నాకు అదృష్టం కలిసొచ్చి రానున్న మ్యాచ్‌ల్లో టాస్ గెలుస్తానేమో అని మహీ భాయ్‌తో చెప్పా. 'నీ లక్ ఏమీ మారదు. ప్రాక్టీస్‌లో చాలాసార్లు టాస్ గెలిచావ్ కదా, అందుకే ఇప్పుడు ఓడిపోతున్నావు' అని సరదాగా అన్నాడు' అని రుతురాజ్ చెప్పాడు. కాగా, తాజా పంజాబ్ మ్యాచ్‌తో సహా ప్రస్తుత సీజన్లో రుతురాజ్ 10లో 9సార్లు టాస్ ఓడిపోయాడు.
ఇక క్రికెట్లో మ్యాచ్‌లు నెగ్గడంలో టాస్ (Toss)లు కూడా అప్పుడప్పుడు కీలక పాత్ర పోషిస్తాయి. టాస్ నెగ్గితే పిచ్ కండిషన్, వాతావరణాన్ని బట్టి బ్యాటింగ్ లేదా బౌలింగ్ నచ్చింది ఎంచుకోవచ్చు. కొందరు ప్లేయర్లైతే టాస్ నెగ్గితే సగం మ్యాచ్ గెలిచినట్లు ఫీలైపోతుంటారు. ఐపీఎల్ మ్యాచ్‌లు అందుకు వ్యతిరేకం కాదు. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ టాస్‌ది కీలక పాత్రే!
-
Ruturaj Gaikwad said, "I'm winning the toss in the practice, but not winning in the match. I'm really under pressure at the toss". pic.twitter.com/ovntvzmZB2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024
ఇక మ్యాచ్ విషయానికొస్తే, పంజాబ్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. జాని బెయిర్‌స్ట్రో (46 పరుగులు), రిలీ రొస్సో (43 పరుగులు) రాణించారు. చివర్లో శశాంక్ సింగ్ (25 పరుగులు), శామ్ కరన్ (26 పరుగులు) పంజాబ్‌కు విజయాన్ని అందించారు. ఇక ప్రస్తుత సీజన్లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం కాగా, చెన్నైకి ఐదో ఓటమి.
'ధోనీ చేసింది కరెక్ట్ కాదు!'- ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్ - IPL 2024
చెన్నై జట్టుకు బిగ్ షాక్ - ఒకేసారి ఐదుగురు ప్లేయర్స్ దూరం! - IPL 2024 CSK