RR VS PBKS IPL 2024: 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శామ్ కర్రన్ (63 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో 2, ట్రెంట్ బోల్ట్ 1 వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో పంజాబ్ కూడా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (6 పరుగులు), జానీ బెయిర్ స్టో (14 పరుగులు) తక్కువ స్కోర్లకే పరిమితం అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన రెలీ రొస్సో (22 పరుగులు) దూకూడుగా ఆడే క్రమంలో ఆవేశ్ ఖాన్‌కు చిక్కాడు. యంగ్ బ్యాటర్ శశాంక్ సింగ్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 8 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో శామ్ కర్రన్, జితేశ్ శర్మ (22 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెటట్టాడు. ఆఖర్లో అశుతోష్ శర్మ (17* పరుగులు) రాణించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అశ్విన్ (28) ఫర్వాలేదనిపించాడు. ఇక సంజు శాంసన్ (18), టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ (18) ఆకట్టుకోలేకపోయారు. యశస్వీ జైస్వాల్ (4), రోవ్‌మన్ పావెల్ (4), ధ్రువ్ జురెల్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమై విఫలమయ్యారు. ఇక పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 2, రాహుల్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎలిస్ చెరో వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ తుది జట్టు : సంజు శాంసన్ (కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రొవ్‌మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎలిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ - మిగిలిన రెండు ఎవరివో? - IPL 2024
'విరాట్ మళ్లీ కెప్టెన్ అవ్వాలి- ధోనీలా ఇంపాక్ట్ చూపిస్తాడు!' - IPL 2024