ETV Bharat / sports

రోహిత్ ఫన్నీ టాక్స్- మీమర్స్ గెట్ రెడీ- ఆ మ్యాచ్​లో లీక్ ఇస్తాడంట

Rohit Sharma Umpire Funny Video: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో యాక్టీవ్​గా ఉంటూ మీమర్స్​కు మంచి స్టఫ్ ఇస్తుంటాడు. ఈ మధ్య ఆయా మ్యాచ్​ల్లో రోహిత్ మాటలు నెటిజన్లకు నవ్వులు పూయించాయి. అయితే రోహిత్ వీటిపై రీసెంట్​గా స్పందించాడు.

Rohit Sharma Umpire Funny Video
Rohit Sharma Umpire Funny Video
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 11:27 AM IST

Rohit Sharma Umpire Funny Video: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో చాలా కూల్​గా, ఫన్నీగా ఉంటాడు. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి ప్లేయర్లను ప్రోత్సహిస్తూ జట్టును గెలుపు దిశగా నడిపించడం రోహిత్ స్ట్రాటజీ. తన మాటలు, మేనరిజంతో గ్రౌండ్​లో మ్యాచ్ వాతావరణాన్ని ఫన్నీగా మార్చేస్తాడు. ఈ క్రమంలో రోహిత్ సోషల్ మీడియా మీమర్స్​కు ఫుల్ స్టఫ్ ఇస్తుంటాడు. ఆయితే 2024 జనవరిలో అఫ్గానిస్థాన్​తో జరిగిన మూడో టీ20లో రోహిత్- ఫీల్డ్ అంపైర్ మధ్య ఓ సంభాషణ సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది.

అయితే రోహిత్​ రీసెంట్​గా ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​లో ఓ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. కాగా, స్టంప్స్​ మైక్​లో రికార్డయ్యే రోహిత్ ఫన్నీ​ సంభాషణల గురించి ప్రోగ్రామ్ హోస్ట్ కెప్టెన్​ను అడిగ్గా అడగ్గా ఫన్నీగా వివరించాడు.'ఆ మ్యాచ్​కు ముందు రెండుసార్లు డకౌట్ అయ్యాను. రెండు డకౌట్​ల తర్వాత మ్యాచ్​లో తొలి పరుగు సాధించడం ఎంతో ముఖ్యం. అయితే ఆ మ్యాచ్​లో బంచి బ్యాట్​ను తాకి ఫోర్ వెళ్లింది. అది అంపైర్ లెగ్​బై గా ప్రకటించాడు. క్రీజులో ఉన్నప్పుడు నా దృష్టి అంతా బ్యాటింగ్ పైనే ఉంటుంది. నేను స్కోర్ బోర్డును చూడను. ఓవర్ పూరైన తర్వాత స్కోర్ బోర్డను చూస్తే 'రోహిత్ శర్మ 0' అని ఉంది. ఫోర్ బాదినా కూడా నా స్కోర్ జీరో ఉందని నేను ఆశ్చర్యపోయా. అప్పుడు నేను అంపైర్​ను లెగ్​ బై ఇచ్చావా అని అడిగా' అని రోహిత్ అన్నాడు.

ఈ మ్యాచ్​లో రోహిత్ బౌండరీతో పరుగుల ఖాతా తెరిచినా, అంపైర్ దాన్ని లెగ్​బైగా ప్రకటించాడు. దీంతో రోహిత్ ఖాతాలో పరుగులేమీ యాడ్ కాలేదు. స్కోర్ బోర్డు చూసిన రోహిత్ 'అరె వీరు, ఫస్ట్​ బాల్​ లెగ్ బై ఇచ్చావా? అది బ్యాట్​కు తగిలింది' అని అంపైర్​తో నవ్వుతూ అన్నాడు. అది స్టంప్స్ మైక్​లో రికార్డైంది. ఇక సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో నెటిజన్లకు కూడా నవ్వు తెప్పించింది.

అయితే గ్రౌండ్​లో ఇవన్నీ కావాలని చేసేవి కాదని సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాల్సి వస్తుందని రోహిత్ అన్నాడు. 'నేను కెప్టెన్​ కాబట్టి బాల్ ట్రాకింగ్ స్పష్టంగా కనిపిస్తుందని స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తుంటా. ఈ క్రమంలోనే టీమ్​మేట్స్​తో మాట్లాడతా. అవి మైక్రోఫోన్​లో రికార్డ్ అవుతాయి. అవి నెటిజన్లకు ఫన్నీగా అనిపిస్తాయి' నవ్వుతూ అన్నాడు. ఇక ఇప్పటి వరకూ స్టంప్స్​మైక్​లో రాని ఫన్నీ సంభాషణలు ఏమైన ఉంటే లీక్ చేయమని అడిగితే 'ఇప్పుడు కాదు. ధర్శశాల మ్యాచ్​లో లీక్ చేస్తా' అని అన్నాడు. దీంతో ధర్శశాల మ్యాచ్​లో రోహిత్ మళ్లీ ఏం మాట్లాడతాడని ఫ్యాన్స్​ ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.

స్పెషల్ హెలికాప్టర్​లో రోహిత్- హాలీవుడ్ హీరో లెవెల్​ ఎంట్రీ!

విరాట్, రోహిత్​ కాదు- 'జై షా'నే క్రికెట్​లో పవర్​ఫుల్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.