ETV Bharat / sports

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

Rohit Sharma Retirement: స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్​పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

rohit sharma retirement
rohit sharma retirement
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 5:32 PM IST

Updated : Apr 12, 2024, 9:07 PM IST

Rohit Sharma Retirement: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో ఒక్కో ఫార్మాట్​ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్న రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలకు హిట్​మ్యాన్ చెక్ పెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్న రోహిత్ రీసెంట్​గా 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' పాడ్​కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాను ఇప్పట్లో క్రికెట్​ నుంచి తప్పుకునేది లేదని ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

'నేను రిటైర్మెంట్​ గురించి ఆలోచించట్లేదు. కానీ, జీవితం ఎలా సాగుతుందనేది మనకు తెలియదు. ప్రస్తుతం నేను అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నా. కచ్చితంగా ఇంకొన్నేళ్లు ఆటలో కొనసాగుతా. భారత్ వరల్డ్​కప్ సాధించాలన్నది నా కోరిక. వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2025లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా' అని రోహిత్ చెప్పాడు.

గతంలోనూ
ఇక గతంలోనూ రిటైర్మెంట్​ గురించి రోహిత్ మాట్లాడాడు. 'ఎప్పుడైతే నిద్రలో నుంచి లేవగానే క్రికెట్ ఆడే పరిస్థితిలోలేను అని నాకు అనిపిస్తే ఆ రోజే ఆటకు గుడ్​బై చెప్పేస్తా. కానీ, గత రెండు మూడేళ్లుగా నా ఆట అత్యుత్తమంగా ఉంది. ప్రస్తుతం నేను నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నా' అని రోహిత్ అన్నాడు.

Rohit Sharma IPL: ప్రస్తుత ఐపీఎల్​లో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో మినహా అన్నింట్లోనూ రాణించాడు. ఇందులో రెండు సార్లు 40+ స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్​లు ఆడిన రోహిత్ 167.74 స్ట్రైక్​ రేట్​తో 156 పరుగులు చేశాడు. ఇందులో 17ఫోర్లు, 10 సిక్స్​లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే రోహిత్ 128 పరుగులు సాధించాడు.

ఇక ఈ సీజన్​లోనే ఐపీఎల్​లో రికార్డులు సొంతం చేసుకున్నాడు. దిల్లీతో మ్యాచ్​లో ఐపీఎల్​లో 100 క్యాచ్​లు అందుకున్న ఫీల్డర్​గా నిలిచాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో రోహిత్ 3 సిక్స్​లు బాదాడు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియంలో 100 టీ20 సిక్స్​లు బాదిన ఏకైక క్రికెటర్​గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

'వరల్డ్ కప్​ కోసమే కదా ఇదంతా' - దినేశ్​ను టీజ్​ చేసిన రోహిత్ శర్మ! - IPL 2024 MI VS RCB

ఆకాశ్​ కారులో రోహిత్! - హిట్​మ్యాన్​ కోసం ఆ ఫ్రాంచైజీ రెడీ! - Rohit Sharma Mumbai Indians

Last Updated : Apr 12, 2024, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.