Rohit Sharma Retirement: భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఒక టెస్టు మిగిలుండగానే సిరీస్ దక్కించుకుంది. తాజాగా ధర్మశాలలో జరిగిన నామమాత్రపు ఐదో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో కలిసి జియో సినిమా చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఈ చిట్‌చాట్‌లో రోహిత్ రిటైర్మెంట్ ప్రస్తావన రాగానే అతడు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
'ఎప్పుడైతే నిద్రలో నుంచి లేవగానే క్రికెట్ ఆడే పరిస్థితిలోలేను అని నాకు అనిపిస్తే ఆ రోజే ఆటకు గుడ్‌బై చెప్పేస్తా. కానీ, గత రెండు మూడేళ్లుగా నా ఆట అత్యుత్తమంగా ఉంది. ప్రస్తుతం నేను నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నా' అని రోహిత్ అన్నాడు. ఈ వీడియో చూసిన రోహిత్ ఫ్యాన్స్, 'హిట్‌మ్యాన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంకో మూడేళ్ల దాకా క్రికెట్ ఆడే సత్తా అతడిలో ఉంది' అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్‌కు దూరం!: ఇక ధర్మశాల టెస్టులో రోహిత్ గాయపడ్డాడు. వెన్నునొప్పి బాధతో మూడో రోజు బరిలోకి దిగలేదు. ఆతడి స్థానంలో పేసర్ జస్ప్రత్ బుమ్రా జట్టును నడిపించాడు. ఇక టీమ్ఇండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏమీ లేవు. జూన్‌లో నేరుగా టీ20 వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే పొట్టికప్ టోర్నీ దృష్యా రోహిత్ 2024 ఐపీఎల్‌కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్కు కూడా సమాచారం ఇచ్చాడట. ఇక త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ఇక మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్- 17 ప్రారంభం కానుంది.
రోహిత్, గిల్ సెంచరీల మోత- భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లాండ్‌తో ఐదో మ్యాచ్ - రోహిత్, యశస్వి, కుల్దీప్ రికార్డులే రికార్డులు