ETV Bharat / sports

బిజినెస్​లోనూ రోహిత్ మార్క్​- హిట్​మ్యాన్ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

Rohit Sharma Investments: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన రోహిత్ శర్మ స్టార్ క్రికెటర్‎గా తన తడాఖా చూపిస్తున్నాడు. క్రికెట్‎ను కెరీర్‎గా ఎంచుకున్న రోహిత్ శర్మ, పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 10:39 PM IST

Rohit Sharma Investments: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కెరీర్​లో పీక్స్​లో ఉన్నాడు. మూడు ఫార్మాట్​లలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న హిట్​మ్యాన్ బ్యాట్​తోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో రోహిత్ ఒకడు. ఈ నేపథ్యంలో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రికార్డులు క్రియేట్ చేశాడు.

ఇటీవల పొట్టి క్రికెట్ ఫార్మట్​లో 250 విజయాల్లో భాగమై అరుదైన రికార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇలా క్రికెట్​లోనే కాకుండా వ్యాపారంపైనా దృష్టి ఆ రంగంలోనూ రాణిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం రోహిత్ నెట్​వర్త్ రూ.230 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్ ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాడో మీకు తెలుసా?

వ్యాపారంలో పెట్టుబడులు: రాపిడోబోటిక్స్, వీరూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ వంటివి రోహిత్ శర్మ పెట్టుబడుల్లో ప్రధానమైనవి. ఈ రెండు అతిపెద్ద స్టార్టప్స్​లో రోహిత్ పెట్టుబడులు రూ.88 కోట్లు దాకా ఉన్నట్లు సమాచారం. రోబోటిక్ ఆటోమేషన్ పరిష్కారాలను అందించే సంస్థ రాపిడోబోటిక్స్. ఇక వెరూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ ఒక హెల్త్ కేర్ కంపెనీ. ఈ రెండు పెట్టుబడులు టెక్నాలజీ, సాధారణ ప్రజల ఆరోగ్యంపై రోహిత్ శర్మకు ఉన్న అవగాహనను తెలియజేస్తున్నాయి.

రాపిడోబోటిక్స్ కంపెనీలో తన పెట్టుబడులను ధ్రువీకరించడానికి రోహిత్ ఒక సింగిల్ ఇన్వెస్ట్‎మెంట్ రౌండ్​లో పాల్గొన్నాడు. వియూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ 2018లో ఏర్పాటైంది. ఇదేవిధంగా పొలాలు, చేపల పెంపకం నుంచి సేకరించిన వివిధ రకాల మాంసం ఉత్పత్తులు, సీఫుడ్స్ అందించే మరో ఫ్లాట్​ఫామ్​లో కూడా రోహిత్ పెట్టుబడులు ఉన్నాట్లు తెలుస్తోంది.

సామాజిక సేవ కార్యక్రమాలు: రోహిత్‎లో దాతృత్వం కూడా చాలా ఎక్కువ. మానవ సంక్షేమానికి, జంతు సంరక్షణలో ఎప్పుడూ ముందుటాడు రోహిత్. 2015లో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్​మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సంస్థలో చేరి అప్పటి నుంచి జంతువుల ప్రాణాలను కాపాడటంపై అవగాహన కల్పిస్తున్నారు.

అదే సంవత్సరంలో కెన్యాలో వేట వ్యతిరేక ప్రచారం కోసం ప్రముఖ హాలీవుడ్ నటులు మాట్ లెబ్లాంక్, సల్మా హయెక్‎లతో కలిసి పనిచేశాడు. 2017లో తన పేరు, వన్డే జెర్సీ నెంబర్ ఉన్న మొబైల్ ఫోన్ కవర్లు, ఇతర వస్తువులను ఆన్లైన్ వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని జంతు సంరక్షణ సంస్థకు అందించాడు. ఆ తర్వాత సంవత్సరం WWF ఇండియా రైనో అంబాసిడర్‎గా నియమించబడ్డాడు.

ఖరీదైన ఇల్లు: రోహిత్ శర్మకు ముంబైలోని వర్లీలో అత్యంత ఖరీదైన నివాసం ఉంది. అహుజా టవర్స్ 29వ అంతస్తులో 4BHK ఇంట్లో రోహిత్ నివాసం ఉంటున్నాడు. ఈ ప్లాట్ నుంచి చూస్తే అరేబియా సముద్రం 270 డిగ్రీల వ్యూతో చాలా అందంగా కనిపిస్తుంది.

సెంచరీతో కదం తొక్కిన హిట్​మ్యాన్- కెరీర్​లో 47వ శతకం పూర్తి.

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.