Rohit Sharma India Vs Bangladesh 2nd Test : కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ కీలక డెసిషన్ తీసుకున్నాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారి మ్యాచ్ మొదలయ్యేందుకు కాస్త సమయం పట్టింది. దీంతో టాస్ నెగ్గిన తర్వాత రోహిత్ బౌలింగ్ ఎంచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
సాధారణంగా స్వదేశంలో జరిగే మ్యాచుల్లో ఎక్కువగా టాస్ గెలిచితే టీమ్‌ఇండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ, రోహిత్ 9 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే కాన్పూర్ స్టేడియంలో ఇదే డెసిషన్‌ను 60 ఏళ్ల క్రితం తొలిసారి తీసుకున్నారు. అప్పటి కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ ఈ నిర్ణయం తీసుకుని హౌం గ్రౌండ్లో తొలిసారి బౌలింగ్ చేశారు. అయితే ఆ మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది.
ఇదిలా ఉండగా, గతంలోనూ టీమ్ఇండియా కెప్టెన్లు టెస్ట్ క్రికెట్లో బౌలింగ్‌ను ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. 2015లో విరాట్ కోహ్లీ ఇలానే సౌతాఫ్రికాపై తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడం గమనార్హం. మరి ఇప్పుడు ఈ రెండో టెస్టు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.
ప్రస్తుతం జరుగుతున్న ఈ రెండో టెస్టులో టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇప్పటికే ఈ రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసేసి టీ20 సిరీస్‌కు వెళ్లాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా ముందుకు సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని బంగ్లా చూస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (31), మొమినల్ హక్ (40) దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ సమయానికి 45 పరుగులు జోడించారు. అయితే భారత పేస్‌ను అడ్డుకొని బంగ్లా బ్యాటర్లు నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారు. అంతకుముందు ఓపెనర్లుగా దిగిన షద్మాన్ ఇస్లామ్ (24), జకీర్ హసన్ (0)ను యువ బౌలర్ ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.
రికార్డులకు దగ్గరలో రోహిత్, విరాట్, అశ్విన్- కాన్పూర్ టెస్టు అందుకుంటారా? - Ind vs Ban 2nd Test
కాన్పూర్ స్టేడియం సేఫ్ కాదట - మనోళ్లు సిక్స్ బాదితే ఆ స్టాండ్ కూలే ప్రమాదం? - Ind vs Ban 2nd Test