ETV Bharat / sports

లేడీ ఫ్యాన్​తో రోహిత్ నాగిన్ డ్యాన్స్- వీడియో వైరల్ - ROHIT SHARMA NAGIN DANCE

Rohit Sharma Nagin Dance : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన లేడీ ఫ్యాన్​తో నాగిన్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Rohit Sharma Nagin Dance
Rohit Sharma Nagin Dance (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 10, 2024, 10:41 AM IST

Rohit Sharma Nagin Dance : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అభిమానులతో చాలా సరదాగా ఉంటాడు. ఇటీవల ముంబయిలో ఓ అభిమాని కోసం తన కారును రోడ్డుపై ఆపి మరీ ఫొటో దిగాడు. ఈ క్రమంలో ఆ అభిమాని పుట్టినరోజు అని పక్కనున్నవారు చెప్పడంతో ఆమెకు రోహిత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా రోహిత్ ఫ్యాన్స్​కు మరిచిపోలేని జ్ఞాపకాలను ఇస్తుంటాడు. అయితే ఓ కామెడీ షోలో రోహిత్ లేడీ ఫ్యాన్​తో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

లేడీ ఫ్యాన్​తో రోహిత్ నాగిన్ డ్యాన్స్
2024 టీ20 ప్రపంచకప్​లో ఆడిన కొందరు భారత ఆటగాళ్లతో కలిసి ఇటీవల రోహిత్ శర్మ ఓ కామెడీ షోకు హాజరయ్యాడు. ఆ షోలో పాల్గొన్న ఓ లేడీ ఫ్యాన్​ అభిమాని తనతో స్టెప్పులు వేయమని రోహిత్ ను కోరింది. అయితే తొలుత రోహిత్ అందుకు నిరాకరించాడు. ఆ తర్వాత అభిమాని కోరిక మేరకు నాగిన్ డ్యాన్స్ వేశాడు. ఆ సమయంలో ప్రేక్షకుల మధ్య రోహిత్ భార్య రితిక కూడా ఉంది. ఆమె కూడా మెల్లగా రోహిత్ డ్యాన్స్ ను చూసి నవ్వుకుంది. కామెడీ షోలో రోహిత్ అభిమానితో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ క్లిప్​ను ఆ కామెడీ షోలో ప్రసారం చేయలేదట.

ఫ్యాన్స్​ షాక్
అయితే ఈ వైరల్ వీడియో క్లిప్​ చూసిన రోహిత్ అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ సహా టీమ్ఇండియా క్రికెటర్లు పాల్గొన్న ఆ కామెడీ షోను చూశామని కానీ, ఎక్కడా రోహిత్ నాగిన్ డ్యాన్స్ క్లిప్ కనిపించలేదని పోస్టులు పెడుతున్నారు.

కాగా, అదే షో టీ20 వరల్డ్ కఫ్ పైనల్​లో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని రోహిత్ షేర్ చేసుకున్నాడు. 'ఛేజింగ్​లో సౌతాఫ్రితాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. వాళ్లకు ఇంకా చాలా వికెట్లు ఉన్నాయి. మేమంతా కంగారు పడుతున్నాం. కానీ, కెప్టెన్ కంగారు పడినట్లు కనిపించకూడదు. అప్పుడు గేమ్​ను స్లో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు ఫామ్​లో ఉన్నారు. ఆ మూమెంట్​​లో రిషభ్ తన టాలెంట్​తో ఆటను కాసేపు నిలిపివేసి, వాళ్ల ఫ్లో దెబ్బతీశాడు. తన మోకాలికి ఏదో అయినట్లు కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి బ్యాండేజ్ వేస్తున్నాడు. దీంతో గేమ్ స్లో అయ్యింది. దీనివల్ల మేం గెలిచాం అని అనడం లేదు. కానీ, అక్కడ పంత్ తెలివిగా వ్యవహరించడం కలిసొచ్చింది' అని రోహిత్ కామెడీ షోలో చెప్పుకొచ్చాడు.

ధోనీ సలహా పట్టించుకోని రోహిత్‌! హిట్​మ్యాన్​ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఏం జరిగిందంటే?

లేడీఫ్యాన్​కు రోహిత్ బర్త్ డే విషెస్!- రోడ్డుపై కార్ ఆపి మరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.