Rohit Sharma 264 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుకు బుధవారానికి (నవంబర్ 13) పదేళ్లు. సరిగ్గా 10ఏళ్ల కిందట ఇదే రోజు రోహిత్ శర్మ వన్డేల్లో 264 పరుగులు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటికీ అదే అత్యత్తమ వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. దశాబ్ద కాలంగా ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. అలాగే ఈ సెంచరీతోనే హిట్‌మ్యాన్ వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
2014 నవంబర్ 13న భారత్- శ్రీలంక మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ విధ్వంసమే సృష్టించాడు. తన ఇన్నింగ్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో సునామీ సృష్టించాడు. శ్రీలంక బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా ఊచకోత కోశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్‌లతో ఏకంగా 264 పరుగులు బాది ఔరా అనిపించాడు. వన్డేల్లో ఒక జట్టు ప్లేయర్లంతా సాధించే స్కోర్ చేసి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. రోహిత్ దెబ్బకు భారత్ ఆ మ్యాచ్‌లో 404-5 భారీ స్కోక్ సాధించింది. అనంతరం శ్రీలంకను 251 పరుగులకే ఆలౌటైంది. అంటే రోహిత్ కంటే శ్రీలంక ఇంకా 13 పరుగులు తక్కువే చేసింది. ఓవరాల్‌గా భారత్ 153 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
A record for the ages! 🏏👏
— Star Sports (@StarSportsIndia) November 13, 2024
On this day in 2014, Rohit Sharma redefined batting with an unforgettable 264-run knock against Sri Lanka!
💥 The highest-ever score in ODI history, his innings was a masterclass in timing, power, and resilience. pic.twitter.com/CKcbq4rSiu
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
- రోహిత్ శర్మ (భారత్)- 264 vs శ్రీలంక, 2014
- మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 234 vs వెస్టిండీస్, 2015
- వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)- 219 vs వెస్టిండీస్, 2011
- క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 215 vs జింబాబ్వే, 2015
- ఫకర్ జమాన్ (పాకిస్థాన్)- 210* vs జింబాబ్వే, 2018
మూడు డబుల్ సెంచరీలు
2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో రోహిత్ కెరీర్లో తొలి వన్డే డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ తర్వాత ఏడాదే శ్రీలంకపై రెండో (264) ద్విశతం నమోదు చేసి, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక 2017లో మళ్లీ శ్రీలంకపైనే రోహిత్ (208*) మూడో డబుల్ సెంచరీ బాదాడు. దీంతో వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.
రోహిత్ 'డబుల్ ధమాకా'కు 11ఏళ్లు- ఆసీస్‌పై ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ స్పెషలే!
14 ఏళ్ల క్రితం సచిన్ డబుల్ సెంచరీ - వన్డే హిస్టరీలో బెస్ట్ మూమెంట్!