Rohan Bopanna Karnataka CM Felicitaion : ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్నను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సత్కరించారు. అంతే కాకుండా బోపన్నకు రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కర్ణాటక సీఎం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
''ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ గెలుచుకున్న రోహన్ బోపన్నను ఇవాల కలిసి అభినందించాను. దీంతో పాటు బోపన్నకు రూ. 50 లక్షల బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటిస్తున్నాను.'' అంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Rohan Bopanna Career : ఇక బోపన్న కెరీర్ విషయానికి వస్తే - కర్ణాటకలోని కూర్గ్ జిల్లాకు చెందిన బోపన్న తండ్రి కాఫీ ప్లాంటరు. తల్లి గృహిణి. తల్లిదండ్రులు ఇద్దరూ రోహన్‌ను బాగా సపోర్టు చేసేవారు. తనకు 11 ఏళ్ల వయసున్నప్పటి నుంచే అతడు టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. తొలుత ఈ క్రీడపై అంత మక్కువ చూపించని బోపన్న 19 ఏళ్ల సమయానికి టెన్నిస్‌నే అతడి కెరీర్‌గా మలుచుకున్నాడు. అలా 1996లో బోపన్న తన టోర్నమెంట్లో పాల్గొన్నాడు.
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్)కు సంబంధించిన మ్యాచ్ ఆడిన బోపన్న తొలి మ్యాచ్‌లోనే జూనియర్ లెవెల్లోనే విజయం సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 2002లో జరిగిన డేవిస్ కప్‌లో ఇండియా తరఫున మొదటి సారి పోటీలో పాల్గొన్నాడు. 2012, 2016 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నాడు. 2017లో అతని మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.ఆ తర్వాత కెనడా ప్లేయర్ గాబ్రియేలా డాబ్రోస్కీ తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విన్ అయ్యాడు. 2023లో డేవిస్ కప్‌కు వీడ్కోలు పలికాడు.
అయితే ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెరుపు వేగంతో దూసుకెళ్లి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అలా 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గిన పురుష టెన్నిస్ ప్లేయర్‌గా బోపన్న రికార్డు సృష్టించాడు. దీంతో టెన్నిస్ దిగ్గజాలు మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచాడు.
మూడున్నర కోట్ల ప్రైజ్ మనీ - రోహన్ నెట్ వర్త్ ఎంతంటే ?
మరోవైపు రోహన్ నెట్ వర్త్‌ను చూస్తే - ఈ ఏడాది జనవరి వరకు బోపన్న నెట్ వర్త్ విలువ దాదాపు 4.5 మిలియన్ డాలర్లు అని అంచనా. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆ సొమ్ము రూ. 37.4 కోట్లు. అతడి సంపాదనలోని సింహభాగం టెన్నిస్ నుంచే వస్తుందట.
ఇక ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన బోపన్న - మ్యాథ్యూ ఎబ్డెన్ జోడీకి రూ. 3.98 కోట్లు ప్రైజ్ మనీ వచ్చింది. ఇవి కాకుండా రోహన్, Asics (ఫుట్ వేర్ కంపెనీ), GoodDot (ఆహార తయారీ కంపెనీ), Indian Oil (ఆయిల్ కంపెనీ)లతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు. బోపన్నలో ఓ సామాజిక సేవకుడు కూడా ఉన్నాడు. రోహన్ దివ్యాంగ పిల్లలకు చదువు చెప్పిస్తారు. దీనికోసం ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ఈ పాఠశాల కర్ణాటకలోని తన సొంత ప్రాంతమైన కూర్గ్ లో ఉంది.
చరిత్ర సృష్టించిన బోపన్న - 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ విన్
'బోపన్న' బౌన్స్ బ్యాక్- గ్రాండ్‌స్లామ్‌తో కెరీర్ ఫుల్‌ఫిల్!