ETV Bharat / sports

'టీమ్ఇండియాలో పూజారాకు ఇంకా ప్లేస్ ఉంది- జట్టుకు అతడు అవసరం!'

పుజారా కమ్​బ్యాక్ గురించి ఊతప్ప కామెంట్స్- జట్టుకు అతడి అవసరం ఉందన్న మాజీ క్రికెటర్

Pujara Comeback
Pujara Comeback (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Robin Uthappa on Pujara : 2024-25 బోర్డర్ గావాస్కర్ ట్రోఫీకి భారత్ సిద్ధమవుతోంది. టెస్టు ఛాంపియన్​షిప్ టోర్నీలో ఫైనల్​ చేరాలంటే భారత్​తోపాటు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ అత్యంత​ కీలకం కానుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ఇప్పటికే టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు.

ఈ సిరీస్​కు సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అయితే టీమ్ఇండియా సొంత గడ్డపై న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ ఓడడం వల్ల పుజారాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పుజారా కమ్​బ్యాక్​ గురించి మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్​ పర్యటనకు వెళ్లనున్న జట్టులో పూజారాకు ఇంకా చోటు ఉందని అన్నాడు.

'ఛెతేశ్వర్ పుజారాకు టీమ్ఇండియా టెస్టు జట్టులో ఇప్పటికీ స్థానం ఉంది. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకోవాలి. జట్టుకు పుజారా అవసరం ఉందని నా అభిప్రాయం. మన బ్యాటింగ్ ఆర్డర్​లో ఆరో నెంబర్ ప్లేయర్ వరకు అందరూ అగ్రెసివ్​గా ఆడేవాళ్లే ఉన్నారు. కానీ, మనకు రాహుల్ ద్రవిడ్, పూజారా, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ లాంటి ఆటగాళ్లు అవసరం. బ్యాటింగ్​లో కీలక పాత్ర పోషిస్తూ ఇన్నింగ్స్​లో చివరి వరకు ఉండగలిగే ప్లేయర్ ఎప్పటికీ అవసరమే' అని ఊతప్ప రీసెంట్​గా తన యూట్యూబ్ ఛానెల్​లో మాట్లాడాడు.

అలాగే సీనియర్ ఆల్​రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి కూడా మాట్లాడాడు. టీమ్ఇండియా ఎక్కువగా అశ్విన్​పైనే ఆధారపడుతోందని అన్నాడు. 'అశ్విన్ ఫామ్​లో లేకపోవడం తాత్కాలికమే. అతడు ఓ లెజెండ్. ఆస్ట్రేలియాకు నాథన్ లియాన్ ఎంత ముఖ్యమో, టీమ్ఇండియాకు అశ్విన్ కూడా అంతే కీలకం. భారత్ ఎక్కువగా అశ్విన్, బుమ్రాపై ఎక్కువగా ఆధారపడుతోంది' అని ఊతప్పు పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్​లో భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీశ్​ కుమార్ రెడ్డి.

ట్రావెలింగ్ రిజర్వ్ - ముకేశ్ కుమార్, నవ్​దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- తెలుగు కుర్రాడికి లక్కీ ఛాన్స్​

అక్కడ వారిని ఓడించలేరు! - WTC ఫైనల్​ కాదు, ఫస్ట్ ఆ సిరీస్​పై ఫోకస్ పెట్టండి : గావస్కర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.