Rishabh Pant Playing Marbles : ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఎన్సీఐలో విశ్రాంతి తీసుకుంటూ తదుపరి మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నాడు. ఇక రానున్న ఐపీఎల్లో మరోసారి తన మెరుపులు మెరిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. క్రికెట్‌కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్నాడు. అయితే తాజాగా రిషబ్ చేసిన ఓ పని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఓ రోడ్డు పక్కన చిన్నపిల్లలతో కలిసి పంత్ గోళీల ఆట ఆడుతూ కనిపించాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు. వాళ్లలో తాను ఓ పిల్లాడిలాగా కలిసిపోయి సీరియస్‍గా ఆటలో నిమగ్నమైపోయాడు. సరదాగా ఆడుతూ ఆ చిన్నారులతో ముచ్చటించాడు. ఇక ఆ వీడియోను పంత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. స్టార్ అయ్యి ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో పంత్ తను చిన్నానాటి రోజులను గుర్తుచేసుకున్నాడేమో అంటూ సరదాగా అంటున్నారు. తనని చూసి వారికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయంటూ అభిప్రాయపడుతున్నారు.
-
Rishabh Pant playing marble with kids.pic.twitter.com/wf2eRHA1uz
— Duck (@DuckInCricket) March 3, 2024
పంత్ కమ్‌బ్యాక్ అప్పుడే!
Rishabh Pant Comeback: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అతడు 2024 ఐపీఎల్లో దిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత కోలుకుంటున్న రిషభ్‌కు, ఎన్సీఏ (National Cricket Academy) మార్చి 5న క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో చేరనున్నాడు. అయితే ఈ విషయంపై జట్టు మెంటార్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
'పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ టోర్నీలో పంత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మార్చి 5న ఎన్సీఏ పంత్‌కు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అతడి కెప్టెన్సీ విషయం గురించి ఆలోచిస్తాం. పంత్‌కు క్రికెట్లో లాంగ్ కెరీర్ ఉంది. అందుకే మేం అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడే అతడిపై పనిభారం పెట్టలేం. ఎన్సీఏ నుంచి రిలీజ్ అయ్యాక, అతడు దిల్లీ క్యాంప్‌లో చేరతాడు. అప్పుడు పంత్ కమ్‌బ్యాక్, వికెట్ కీపింగ్ గురించి అతడితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం. అతడు ఐపీఎల్ నాటికి ఫిట్‌గా లేకపోతే మాకు రికీ భుయ్, షయ్ హోప్, స్టబ్స్ వికెట్ కీపింగ్ కోసం ఉన్నారు' అని గంగూలీ అన్నాడు.
ఫుల్ కాన్ఫిడెంట్‌గా పంత్- 2024 IPL లో బరిలోకి దిగడం పక్కా!
ధోనీ లాస్ట్ సీజన్!, పంత్ కమ్‌బ్యాక్- 2024 IPL మరింత ఆసక్తికరంగా