ETV Bharat / sports

'ఆ ఏడు నెలలు నరకం అనుభవించాను - కనీసం బ్రష్ కూడా చేయలేకపోయా ' - Rishabh Pant Latest Interview - RISHABH PANT LATEST INTERVIEW

Rishabh Pant Road Accident : స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్​ ఇప్పుడిప్పుడే గాయల నుంచి పూర్తిగా కోలుకుని మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. దీంతో రానున్న టీ20 వరల్డ్​ కప్​ టీమ్​లోకి కూడా ఎంపికయ్యాడు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ క్రికెటర్​ యాక్సిడెంట్ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడాడు.

Rishabh Pant
Rishabh Pant (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 4:53 PM IST

Updated : May 28, 2024, 6:42 PM IST

Rishabh Pant Road Accident : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో అద్భుత ఫామ్ కనబరిచాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న పంత్​, తన ఐపీఎల్​ పెర్ఫామెన్స్​తో రానున్న టీ20 ప్రపంచ కప్​ టీమ్​లోనూ స్థానం సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్‌, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడాడు.

"ఆ యాక్సిడెంట్​ నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఆ సమయం నాకు ఎంతో అనుభవాన్ని నేర్పింది. అంతటి గాయాలు చూసి నేను ప్రాణాలతో ఉంటానో లేదో అని అనిపించింది. దాదాపు ఏడు నెలల పాటు విపరీతమైన నొప్పిని అనుభవించాను. అది ఎంతో నరకంగా అనిపించింది. సుమారు రెండు నెలల పాటు కనీసం బ్రష్‌ కూడా చేసుకోలేకపోయాను. వీల్‌ ఛైర్‌లో కూర్చున్న వ్యక్తులను చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించేది. అంతే కాకుండా భయంగానూ ఉండేది. అందుకే నేను చాలా వరకు ఎయిర్‌పోర్టుకు వెళ్లలేకపోయాను. కానీ ఆ భగవంతుడు నన్ను రక్షించాడు" అంటూ అప్పటి చేదు అనుభవాలను పంత్‌ గుర్తు చేసుకున్నాడు.

ఇక రానున్న టీ20 వరల్డ్ కప్​ కోసం ఇప్పటికే టీమ్​ఇండియా యూఎస్​కు పయనమైన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్​మన్ గిల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబే ప్రయాణమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెళ్లారు. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్​తో ఆడనుంది.

భారత జట్టు వివరాలు - రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్.

55 మ్యాచ్‌లు, 20 జట్లు - టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే - T20 WORLD CUP 2024

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్,​ రాహుల్ ఔట్​ - ICC T20 World Cup 2024

Last Updated : May 28, 2024, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.