Rishabh Pant Delhi Premier League : దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తాజాగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ తడబడ్డాడు. పురానీ దిల్లీ 6 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దీంతో అతడిపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ మ్యాచ్‌లో అతడు పేసర్లను ఎదుర్కొన్నంత సులువుగా స్పిన్ బౌలింగ్‌లో ప్రతిభ చూపలేకపోయాడు. దీంతో తన నుంచి భారీ స్కోరును ఆశించిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశే మిగిలింది.
ఆ ఒక్క రన్ లేకుంటే
అయితే ఇదే మ్యాచ్ వేదికగా పంత్ తనలోని రెండో కోణాన్ని చూపించాడు. స్పిన్నర్‌గా సరికొత్త అవతరమెత్తాడు. దిల్లీ సూపర్‌స్టార్స్ జట్టుకు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి పట్టిన పంత్ ఆ జట్టుకు ఇక ఒక్క పరుగు వస్తే గెలుస్తుందన్న సమయంలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే తొలి బంతికే దిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు విజయం సాధించడం వల్ల పంత్‌కు ఓవర్ పూర్తి చేసే అవకాశం దక్కలేదు. అయితే శ్రీలంక పర్యటనలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, రింకు సింగ్ బౌలింగ్ వేశారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ జట్టులోని ప్రతి ఒక్కరితో బౌలింగ్ చేయించేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
RISHABH PANT BOWLING IN DELHI PREMIER LEAGUE...!!!
— cricket addict's (@cricket0addicts) August 18, 2024
He scored 35 in 32 balls while batting.pic.twitter.com/hqUEoE6fmv
మ్యాచ్ సాగిందిలా :
తొలుత బ్యాటింగ్‌కు దిగిన చేసిన పురాణీ దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో 59 పరుగులతో అర్పిత్ రాణా టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆ తర్వత వన్స్ బేడి (47), రిషబ్ పంత్ (35), లలిత్ యాదవ్(34) పరుగులు స్కోర్ చేశారు.
ఆ తర్వాత బరిలోకి దిగిన సౌత్ దిల్లీ జట్టు 19.1 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సౌత్ దిల్లీ బ్యాటర్లలో ఆయుశ్ బదోని(57), పియూన్ష్ ఆర్య(57), అర్ధ సెంచరీలతో మెరిశారు.
'ఆ ఏడు నెలలు నరకం అనుభవించాను - కనీసం బ్రష్ కూడా చేయలేకపోయా ' - Rishabh Pant Latest Interview