ETV Bharat / sports

అప్పుడే హిట్టింగ్ స్టార్ట్ చేసిన 'రింకూ'- రూ.25 కోట్ల స్టార్క్ బౌలింగ్​లో సూపర్ సిక్స్

Rinku Singh Vs Pat Cummins 2024: 2024 ఐపీఎల్​లో బ్యాటర్ల​ మెరుపుల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హిట్టర్ రింకూ సింగ్, స్టార్క్ బౌలింగ్​లో బాదిన సిక్సర్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీరు ఈ సిక్స్ చూశారా?

Rinku Singh Vs Pat Cummins 2024
Rinku Singh Vs Pat Cummins 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 12:22 PM IST

Updated : Mar 20, 2024, 12:33 PM IST

Rinku Singh vs Pat Cummins 2024: 2024 ఐపీఎల్​ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. టోర్నీలో బ్యాటర్ల మెరుపుల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పలు జట్లలోని ఆయా ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. ఈ క్రమంలో కోల్​కతా నైట్​రైడర్స్ హిట్టర్ రింకూ సింగ్ అప్పుడే సిక్సర్ల మోత మొదలు పెట్టేశాడు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్​లో కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు.

అయితే ఇదంతా ప్రాక్టీస్ మ్యాచ్​లో జరిగింది. త్వరలో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల క్యాంప్​ల్లో ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే రీసెంట్​గా కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు తమ ప్లేయర్ల మధ్య ఈడెన్ గార్డెన్స్​లో ప్రీ ఐపీఎల్ ​మ్యాచ్ నిర్వహించింది. ఇందులో టీమ్ పర్పుల్- టీమ్ గోల్డ్ పేర్లతో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీంతో 'రూ.25కోట్ల ఖరీదైన ప్లేయర్ బౌలింగ్​లో ఇండియన్ యంగ్ ప్లేయర్ సిక్సర్ బాదాడు' అంటూ నెటజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, రింకూ ఐపీఎల్​ శాలరీ రూ.55లక్షలే కావడం విశేషం.

2024లో మార్చి 23న సన్​రైజర్స్​తో కోల్​కతా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్​లోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జట్టుతో చేరడం వల్ల కేకేఆర్​కు అదనపు బలం కానుంది. గంభీర్ 2024 ఐపీఎల్​లో కేకేఆర్​కు మెంటార్​గా వ్యవహరించనున్నాడు. ఇక కేకేఆర్ గత 10 సీజన్​లుగా ట్రోఫి నెగ్గలేదు. చివరిసారిగా కోల్​కతా 2014లో ఛాంపియన్​గా నిలిచింది. ఆ తర్వాత కేకేఆర్​కు టైటిల్ గెలవడం కలగా మారింది. మరి గంభీర్ రాకతో ఈసారైనా కోల్​కతా స్టోరీ మారుతుందేమో చూడాలి.

2024 జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, చేతన్‌ సకారియా, సుయాశ్‌ శర్మ, కేఎస్‌ భరత్‌, మనీష్‌ పాండే, హర్షిత్‌ రాణా, రఘువంశీ, అనుకుల్‌రాయ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, సకిబ్‌ హుస్సేన్‌, వైభవ్‌ అరోరా, మిచెల్‌ స్టార్క్‌, ఆంద్రి రసెల్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, సునీల్‌ నరైన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, దుష్మంత చమీర, షెఫానీ రూథర్‌ఫర్డ్‌, ఫిల్‌ సాల్ట్‌.

IPLలో హై వోల్టేజ్ మ్యాచ్​లు- ఈ జట్ల మధ్య పోరు కిక్కే వేరప్ప

ఐపీఎల్​లో కేకేఆర్ జర్నీ- గంభీర్ రాకతో కోల్'కథ' మారేనా?

Last Updated : Mar 20, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.