Rinku Singh KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ 7 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. కొన్ని సీజన్ల నుంచి కోల్‌కతా తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. తన పవర్ హిట్టింగ్‌తో కేకేఆర్‌కు చాలా విజయాలు అందించాడు. అయితే తమ ఫ్రాంచైజీ అతడికి రూ.55 లక్షల జీతం మాత్రమే ఇస్తోంది. ఇదిలా ఉండగా, చాలా ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను అదే ఫ్రాంచైజీ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఇదే విషయం గురించి రింకూను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా దానికి అతడు దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చాడు.
"నాకు రూ.50- 55 లక్షలు కూడా చాలా ఎక్కువ. ఇంత సంపాదిస్తానని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు. అప్పట్లో నా చిన్నప్పుడు రూ.5- 10 రూపాయలు వస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నేను రూ.55 లక్షల రూపాయలు పొందుతున్నాను, ఇది చాలా ఎక్కువ. రూ.55 లక్షల రూపాయలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇది కూడా నా దగ్గర లేనప్పుడు, డబ్బు విలువ నాకు అర్థమైంది. నా ఆలోచన ఎప్పుడూ ఇలానే ఉంటుంది. నేనెప్పుడూ లెక్కలు కూడా వేసుకోలేదు. అవి లేని రోజులను చవిచూశా. అందుకే డబ్బు విలువ నాకు తెలుసు." అంటూ రింకూ చెప్పుకొచ్చాడు.
ఇక రింకూ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే, 2017లో ఈ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రింకూను పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఆ మ్యాచ్ లో అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఆ తర్వాతి ఏడాది జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రింకూను రూ. 80 లక్షలకు సొంతం చేసుకుంది.
అలా 2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకూ ఆడాడు. గాయం కారణంగా 2022లో రింకూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇక 2023 ఐపీఎల్ మినీ వేలంలో కేకేఆర్ అతడ్ని రూ. 55 లక్షలకు కొనుగోలు చేసుకుంది.
'రాహుల్, రింకూను అందుకే పక్కన పెట్టాం- కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవు' - T20 World Cup 2024
'టపాకాయలతో రెడీగా ఉన్నాం, హార్ట్ బ్రేక్ అయ్యిందంటూ ఫోన్ చేశాడు' - T20 world Cup 2024