Rinku Singh Car Gift To Father: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ తన తండ్రికి ఓ ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2023 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన రింకూకు లఖ్‌నవూకు చెందిన ఓ ఫౌండేషన్ రీసెంట్గా రూ.3 కోట్ల నగదును అందించిందట. ఈ నగదుతో రింకూ తన తండ్రికి కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
అదే కారణమా? అయితే రింకూ తండ్రి ఖాన్చంద్ర సింగ్ సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో ఒకటి రీసెంట్గా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. కుమారుడు క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ రింకూ తండ్రి సాధారణ వ్యక్తిగా అదే పని చేస్తున్నారంటూ ఖాన్సింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఆ వీడియో ఎప్పడిదో అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ, తండ్రికి కారు కొనాలని నిర్ణయించుకున్నందుకు రింకూపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
-
No #cricketfans pass without liking this ❤️
— 👑RD चौधरी👑 (@RD_CHOUDHARY07) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
📢 📽️ Cricketer Rinku Singh's father is still doing the same job. Such a down to earth person 🥹🙏🫡🇮🇳🙌#INDvsENG #Bumrah #RIPtemperedglass #BiggBoss17Finale
#TestCricket #AUSvWI
pic.twitter.com/69YFqis0zK
">No #cricketfans pass without liking this ❤️
— 👑RD चौधरी👑 (@RD_CHOUDHARY07) January 28, 2024
📢 📽️ Cricketer Rinku Singh's father is still doing the same job. Such a down to earth person 🥹🙏🫡🇮🇳🙌#INDvsENG #Bumrah #RIPtemperedglass #BiggBoss17Finale
#TestCricket #AUSvWI
pic.twitter.com/69YFqis0zKNo #cricketfans pass without liking this ❤️
— 👑RD चौधरी👑 (@RD_CHOUDHARY07) January 28, 2024
📢 📽️ Cricketer Rinku Singh's father is still doing the same job. Such a down to earth person 🥹🙏🫡🇮🇳🙌#INDvsENG #Bumrah #RIPtemperedglass #BiggBoss17Finale
#TestCricket #AUSvWI
pic.twitter.com/69YFqis0zK
Rinku Singh 5 Sixes: 2023 ఐపీఎల్లో గుజరాత్‌పై ఛేజింగ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్స్‌లు బాదడం వల్ల రింకూ వెలుగులోకి వచ్చాడు. ఈ తర్వాత కూడా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2023 ఐపీఎల్లో అతడు 14 మ్యాచ్‌ల్లో 149.53 స్టైక్ రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.
Rinku Singh International T20 Stats: ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రింకూకు జాతీయ జట్టులో ఆడే ఛాన్స్ వచ్చింది. 2023 ఆగస్టులో రింకూ సింగ్ ఐర్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి రింకూ వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇప్పటివరకు రింకూ 15 ఇన్నింగ్స్‌ల్లో 89 సగటుతో 356 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో అతడి స్ట్రైక్ రేట్ 176.23గా ఉంది.
'ధోనీ, యువీ రిప్లేస్ రింకూనే'- అఫ్గాన్ ప్లేయర్ కామెంట్స్
రింకూ 5సిక్సుల షో- బ్యాటర్‌కు రూ.55లక్షలు- బౌలర్‌కు రూ.5కోట్లు!