ETV Bharat / sports

'అవకాశాలన్ని వదులుకున్నాం - వచ్చే సీజన్​కు స్ట్రాంగ్​ కమ్​బ్యాక్ ఇస్తాం' - RCB Vs PBKS IPL 2024 - RCB VS PBKS IPL 2024

RCB Vs PBKS IPL 2024 : తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ ఓటమి చవి చూసింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ సామ్ కరణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న సీజన్​కు మరింత స్ట్రాంగ్​గా వస్తామని అన్నాడు.

RCB Vs PBKS IPL 2024
Sam Curran (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 8:32 AM IST

RCB Vs PBKS IPL 2024 : గెలిస్తేనే ప్లే ఆఫ్స్​కు వెళ్లగలమన్న పరిస్థితిలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, గురువారం జరిగిన మ్యాచ్​తో ఇంటికి చేరుకుంది. ఉత్కంఠగా జరిగిన పోరులో ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో పంజాబ్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అయితే మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ మీడియాతో మాట్లాడాడు. ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోవడం తమకు చాలా బాధ కలిగిస్తోందనిఅన్నాడు. నెక్స్ట్​ సీజన్​కు మరింత స్ట్రాంగ్​గా తిరిగొస్తామని అన్నాడు.

"నిరాశగా ఉంది. ఈ సీజన్‌లో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. కానీ మేము కావాల్సిన విజయాలు సాధించి మా గమ్యాన్ని చేరుకోలేకపోయాం. శిఖర్ ధావన్ దూరమవ్వడం ఈ వైఫల్యానికి కారణంగా చెప్పలేం. మా జట్టులో ఇంకా ఉత్తమ ప్లేయర్లు ఉన్నారు. మేము మరింత మెరుగ్గవ్వాలి. గొప్ప ప్లేయర్లు ఉన్న టీమ్​కు నాయకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో కొన్ని ఘనతలు సాధించాం, రికార్డు ఛేజింగ్‌ చేశాం. కానీ ఆఖరికి గమ్యానికి చేరుకోలేకపోవడం మాకు బాధగా ఉంది. మా అభిమానులకు క్షమాపణలు. మా పోరాటాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగొస్తాం'' అని సామ్ కరన్ పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే పైచేయిగా నిలిచింది. దూకుడుగా ఆడి తమ ఖాతాలో నాలుగో విజయాన్ని వేసుకుంది. దీంతో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైంది.

బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ జట్టు విఫలమైంది . తొలి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్‌ (6) ఔటైనప్పటికీ బెయిర్‌స్టో (27), రొసో ఆ జట్టును కొంతమేర ఆదుకున్నారు. లోమ్రార్‌ క్యాచ్‌ వదిలేయడం వల్ల బతికిపోయిన రొసో ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. బెయిర్‌స్టో వెనుదిరిగినప్పిటికీ రొసో తన బాదుడు కొనసాగించాడు. కానీ ఆర్సీబీ స్పిన్నర్లు పంజాబ్‌ జోరుకు కళ్లెం వేశారు. కర్ణ్‌ వరుస ఓవర్లలో రొసో, జితేశ్‌ (5)ను ఔట్‌ చేశాడు.

ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టన్‌ (0) కూడా ఒక్క పరుగు చేయకుండానే వెనుతిరిగాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. చివరి వరకూ పోరాడేలా కనిపించినప్పటికీ శశాంక్‌ (37), కోహ్లి తీసిన వికెట్​కు ఔటవ్వక తప్పలేదు. వెంటనే వచ్చిన అశుతోష్‌ కూడా (8) పెవిలియన్ చేరుకోవడం వల్ల పంజాబ్ కొద్దిసేపటికే ఆలౌటైపోయింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు కూడా వదులుకోవాల్సి వచ్చింది.

రికార్డ్​ స్థాయిలో IPL వ్యువర్​షిప్స్- అప్పుడే 51 కోట్లు క్రాస్! - IPL 2024

భారీ టార్గెట్​లను ఓపెనర్లే ఊదేశారు- IPLలో 10 వికెట్ల తేడాతో నెగ్గిన టాప్‌ 5 మ్యాచ్‌లు - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.