ETV Bharat / sports

ఇకపై జడ్డూను అలానే పిలవాలట - చెన్నై ఫ్రాంచైజీ అఫీషియల్ అనౌన్స్​మెంట్​! - Ravindra Jadeja New Name - RAVINDRA JADEJA NEW NAME

Ravindra Jadeja New Name : కోల్​కతా ప్లేయర్లను చిత్తు చేసిన టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, చెన్నై టీమ్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు తమ ఫ్రాంచైజీ ఓ కొత్త నిక్​ నేమ్​ను ఇచ్చింది. ఇంతకీ అదేంటంటే ?

Ravindra Jadeja New Name
Ravindra Jadeja New Name
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 1:31 PM IST

Ravindra Jadeja New Name : ఐపీఎల్​లోని చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు ఓ సెపరేట్ ఫ్యాన్​ బేస్ ఉంది. అందులోని స్టార్స్​కు తమ ఫ్యాన్స్ పలు రకాల ముద్దు పేర్లు పెట్టుకుని పిలుస్తుంటారు. ఇప్పటికే ధోనీని 'తలా' అని సురేశ్​ రైనాను 'చిన్న తలా' అని పిలుస్తుంటారు. వాళ్ల గురించి రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ పదే పదే ఈ పేరును చెప్తుంటారు.

ఇలా ఈ జట్టులో ఈ ఇద్దరికీ మాత్రమే స్పెషల్ నిక్​నేమ్ ఉంది. అయితే తాజాగా ఈ లిస్ట్​లోకి మరో స్టార్ ఆల్​రౌండర్ చేరాడు. కోల్​కతా జట్టుపై తన బంతులతో విరుచుకుపడ్డ రవీంద్ర జడేజాను ఇకపై 'దళపతి' అని పిలవాలట. ఈ విషయాన్నిచెన్నై ఫ్రాంచైజీ కూడా వెరిఫై చేసింది. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే ?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో కోల్‌కతా జట్టుపై మూడు వికెట్లు తీసిన రికార్డుకెక్కాడు జడ్డూ. ఈ గేమ్​లో తన సూపర్ పెర్ఫామెన్స్​కుగానూ అతడు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ తర్వాత జడ్డూతో ప్రముఖ కామెంటేటర్​ హర్షా భోగ్లే మాట్లాడారు. అయితే ఆ సమయంలో ఆయన జడ్డూని 'దళపతి' అని పిలుస్తాడు. ఇది విన్న మన ఆల్​రౌండర్ వెంటనే "నాకు ఇంకా ఆ టైటిల్‌ వెరిఫై కాలేదు. తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారని నేను ఆశిస్తున్నాను" అంటూ సరదాగా అన్నాడు.

దీని తర్వాత హర్షా భోగ్లే ట్విట్టర్​లో ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. "మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా భారీగా అభిమానులు ఉండటం దేశంలో మరే గ్రౌండ్​లోనూ ఉండదేమో. అలాంటి అద్భుత మ్యాచ్​లో నేను ఉండటం నాకు చాలా బాగనిపించింది. జడేజాకు 'క్రికెట్‌ దళపతి' అనే టైటిల్​ వెరిఫికేషన్‌ను మీరు చేస్తున్నారా? " అంటూ హర్షా చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్ హ్యాండిల్​ను ట్యాగ్ చేశాపరు. ఇది చూసిన ఫ్రాంచైజీ, కొద్దిసేపటికే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 'క్రికెట్ దళపతిగా వెరిఫైడ్‌’' అంటూ రిప్లై ఇచ్చింది. ఇక జడ్డూ కూడా ఆనందంగా ఫ్రాంచైజీకి థ్యాంక్స్​ చెప్పాడు.

'ఏంటి జడ్డూ ఇలా చేశావ్​' - ధోనీ ఫ్యాన్స్​ను ఆటపట్టించిన ఆల్​రౌండర్! - Ravindra Jadeja CSK

గెలుపు ట్రాక్ ఎక్కిన చెన్నై- 7 వికెట్లతో సీఎస్కే ఘన విజయం- కేకేఆర్​కు తొలి ఓటమి - KKR vs CSK IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.