Ranji Trophy 2023 - 24 Railways Team Record Chasing : రంజీ ట్రోఫీలో సరి కొత్త రికార్డ్ నమోదైంది. రెల్వేస్ జట్టు చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా తాజాగా త్రిపురతో రైల్వేస్ జట్టుకు మ్యాచ్ జరిగింది. ఈ పోరులోనే 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్ జట్టు ఈ అరుదైన ఘనతను సాధించి మరోసారి అందరి దృష్టిలో పడింది. అంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర జట్టు పేరిట ఉండేది. నాలుగేళ్ల క్రితం 2019-20 సీజన్‌లో ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది సౌరాష్ట్ర జట్టు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో సౌరాష్ట్ర ఆల్‌టైమ్ రికార్డును రైల్వేస్ టీమ్ బ్రేక్ చేసింది.
Railways VS Tripura Ranji Trohpy 2024 : ఇక తాజాగా జరిగిన త్రిపుర - రైల్వేస్ మ్యాచ్ విషయానికి వస్తే - 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది రైల్వేస్ జట్టు. అయితే 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుని లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రిథమ్ సింగ్(169 నాటౌట్),మహ్మద్ సైఫ్(106) సూపర్ సెంచరీలతో విజృంభించారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 175 పరుగులను జోడించారు. అలా వీరిద్దరి ఇన్నింగ్స్ తోడవ్వడంతో 378/5 స్కోరు సాధించింది రైల్వేస్ జట్టు.
అంతకుముందు త్రిపురా రెండో ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది త్రిపుర. కాగా తొలి తొలి ఇన్నింగ్స్‌లో త్రిపురా 149 పరుగులకు ఆలౌట్ అయింది. రైల్వేస్ కూడా 105 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న రైల్వేస్ జట్టు రికార్డు విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
బహు పరాక్ - ఆ పోరాట స్ఫూర్తే పరుగుల తపస్విగా మార్చింది!
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు - ఫాస్టెస్ట్ సెంచరీతో ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం