Rajat Patidar England Series : గతేడాది ఆఖరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌తో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు రజత్ పటీదార్. అయితే అప్పుడు ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన యంగ్ క్రికెటర్ 16 బంతుల్లో 22 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే తాజాగా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచుల్లో వరుసగా సెంచరీలు సాధించి చెలరేగిపోయాడు. తన ఆటతీరుతో అందరినీ అబ్బురపరిచాడు. దీంతో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4 వేల పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన రజత్, ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 404 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలా ఆడిన అన్నీ ఫార్మాట్లలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ ప్లేయర్ తన సూపర్ ఫామ్‌తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు రోజుల టెస్టు సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుతో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే అతడికి నిరాశే మిగిలింది.
మరోవైపు రజత్ అరంగేట్రంపై మాజీలతో పాటు క్రికెట్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న మ్యాచ్‌లో అతడి పర్ఫామెన్స్ చూసేందుకు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ క్రికెటర్‌కు 'ఆల్ ద బెస్ట్' చెబుతున్నారు.
-
Zak Pa to Ra Pa! Couldn’t have asked for a more auspicious start to Rajat’s Test career.#PlayBold #INDvENG #TeamIndia #RajatPatidar @ImZaheer @rrjjt_01 pic.twitter.com/y9HNNLrJIH
— Royal Challengers Bangalore (@RCBTweets) February 2, 2024
భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ తుది జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
వావ్ పటిదార్.. 'బెంగళూరు' కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నావా!