Rahul Dravid Special Message To Gambhir : టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా శిక్షణ నిమగ్నమయ్యారు. శ్రీలంక వేదికగా జరగనున్న టోర్నీల కోసం ప్లేయర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఓ స్పెషల్ వ్యక్తి సర్ప్రైజ్ చేశాడు. ఓ స్వీట్ వాయిస్ మెసేజ్‌ను పంపించిన ఆయన అందులో గంభీర్‌తో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు. ఇంతకీ ఆయనెవరో కాదు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
"హలో గౌతమ్. ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నాను. భారత జట్టుతో నా ప్రయాణం ముగిసి ఈ రోజుతో మూడు వారాలవుతోంది. నా కలలకు మించి ఎంతో గొప్పగా బార్బడోస్‌లో రిటైరయ్యాను. ముంబయిలో జరిగిన ఆ సాయంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. అన్నింటికంటే ఎక్కువగా జట్టుతో నా రిలేషన్, జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటాను. కొత్త కోచ్‌గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నా. భారత క్రికెట్‌పై నీ అంకితభావం నాకు తెలుసు. కోచ్‌గా వాటన్నింటిని అత్యుత్తమంగా ప్రదర్శించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మనపై ఎటువంటి అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. కష్టాల్లోనూ నువ్వు ఒంటరివాడివి కాదు. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్, మేనేజ్‌మెంట్ నుంచి ఎల్లప్పుడూ నీకు సపోర్ట్ ఉంటుంది" అని ద్రవిడ్ తెలిపాడు.
ఇక రాహుల్ ద్రవిడ్ పెట్టిన వాయిస్ మెసెజ్‌తో గంభీర్ కాస్త ఎమోషనలయ్యాడు. దీనికి నాకు ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం కావట్లేదు అంటూనే ఉద్వేగానికి లోనయ్యాడు. టీమ్ కోసం ఎటువంటి పనైనా చేసే వ్యక్తి రాహుల్ ద్రవిడ్ అని, తన నుంచి భవిష్యత్తు తరాలు ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. తనపై ఉంచిన ఈ పెద్ద బాధ్యతను ఎంతో నిజాయతీగా, పారదర్శకంగా నిర్వర్తిస్తానని, అలాగే ద్రవిడ్ గర్వపడేలా ఈ పొజిషన్లో నిల్చుంటానని అన్నాడు.
𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝
— BCCI (@BCCI) July 27, 2024
To,
Gautam Gambhir ✉
From,
Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0
'ఫస్ట్ కెప్టెనే మా అందరికీ రోల్ మోడల్!' - Rohit Sharma First Captain