Rahul Dravid Son U19 team : తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకొనేందుకు సిద్ధమయ్యాడు టీమ్ ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్. కర్ణాటక లీగ్‌లో అదరగొట్టిన అతడు తాజాగా భారత అండర్ - 19 జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డేలతో పాటు నాలుగు రోజుల సిరీస్‌లకు అతడు ఎంపిక అయ్యాడు. సెప్టెంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా అండర్ - 19 జట్టుతో టీమ్ ఇండియా యంగ్ టీమ్ మూడు వన్డేలు, రెండు 'నాలుగు రోజుల' మ్యాచ్‌లు జరగనున్నాయి నాలుగు రోజుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించి తాజాగా భారత యువ జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ద్రవిడ్ తనయుడు పేరు ఉండడంతో ద్రవిడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే సిరీస్ పుదుచ్చేరి వేదికగా జరగనుంది. మల్టీ డే మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఈ వన్డే జట్టుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, గుజరాత్‌కు చెందిన రుద్ర పటేల్ వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఫోర్డే మ్యాచుల కోసం మధ్య ప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వార్ధన్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా, పంజాబ్‌కు చెందిన విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే సమిత్ ద్రవిడ్ మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణించనున్నాడు.
విజయంలో కీలకంగా - ప్రస్తుతం కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ ఆడుతున్నాడు. అతడు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ టోర్నీలో అతడికి బౌలింగ్ వేసే అవకాశం రాలేదు. ఈ ఏడాది జరిగిన కూచ్‌బెహర్ ట్రోఫీలో కర్ణాటక గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు చేసిన అతడు బౌలింగ్‌లో 16 వికెట్లు తీశాడు.
వన్డేల కోసం భారత అండర్ - 19 జట్టు :
మహ్మద్ అమాన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), కార్తికేయ, సాహిల్ పరాఖ్, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కిరణ్ చోర్మలే, యుధాజిత్ గుహా, సమిత్ ద్రవిడ్, నిఖిల్ కుమార్, సమర్థ్ , హార్దిక్ రాజ్ , చేతన్ శర్మ , రోహిత్ రాజావత్ , మహ్మద్ ఈనాన్.
ఫోర్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం జట్టు :
సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), నిత్య పాండ్య, వైభవ్ సూర్యవంశీ, సమిత్ ద్రవిడ్, కార్తికేయ, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), సమర్థ్, చేతన్ శర్మ, నిఖిల్ కుమార్, ఆదిత్య రావత్, అన్మోల్జీత్ సింగ్, మహ్మద్ ఈనాన్, ఆదిత్య సింగ్.
కోహ్లీ - రూట్‌లో బెస్ట్ ఎవరు? గణాంకాలు ఏం చెబుతున్నాయ్? - Virat Kohli vs Joe Root