Rahul Dravid Biopic: భారత స్టార్ క్రికెటర్ల జీవిత కథ ఆధారంగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌లు తీసే ట్రెండ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బయోపిక్ కూడా తీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్న ద్రవిడ్‌కు తన బయోపిక్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ద్రవిడ్ ఇంట్రెస్టింగ్గా రిప్లై ఇచ్చాడు.
'మీ బయోపిక్ ఎప్పుడు? అందులో రాహుల్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది?' అని ఈవెంట్ హోస్ట్ ద్రవిడ్‌ను అడిగారు. దీనికి రాహుల్ స్పందిస్తూ ఎవరో ఎందుకు! డబ్బులిస్తే నేనే చేస్తా అని తన స్ట్రైల్లో జవాబిచ్చాడు. 'నాకు భారీ మొత్తంలో డబ్బులిస్తే, నా పాత్రలో నేనే నటిస్తా' అని రాహుల్ సమాధానమిస్తూ, ఈవెంట్లో నవ్వులు పూయించాడు. కాగా, ఇదే ఆవార్డ్స్ ఈవెంట్లో రాహుల్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్ దక్కింది.
ఇక ఇదే ఈవెంట్లో వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత టీ20 ప్రపంచ కప్ నెగ్గడంపై ద్రవిడ్ మాట్లాడాడు. ' వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఫైనల్‌లోనూ అదే ఉత్సాహంతో బరిలోకి దిగాం. కొత్తగా ఏమీ చేయలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయడంపై దృష్టిపెట్టాం. కానీ, ఆ రోజు మాకంటే ఆస్ట్రేలియా ఇంకాస్త మెరుగ్గా ఆడింది. మనమెంత కష్టపడినా అదృష్టం కూడా కలిసిరావాలి. ఇక టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధతలోనూ పెద్దగా మార్పుల్లేవు. చిన్నచిన్న మార్పులు చేసి బరిలోకి దిగాం. జట్టులోని ప్రతి ఒక్కరిపైనా నమ్మకం ఉంచాం. వన్డే ప్రపంచకప్‌కు ఎలా రెడీ అయ్యామో పొట్టి కప్ కోసమూ అదేవిధంగా సన్నద్ధమయ్యాం' అని అన్నాడు.
షమీ రీఎంట్రీ మరింత ఆలస్యం- అప్పటిదాకా ఆగాల్సిందే! - Mohammed Shami Comeback
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రోహిత్- CEAT అవార్డ్స్‌లో కెప్టెన్ ఘనత - Rohit Sharma 2024