Rahul Dravid Last Day Coach: 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత టీ20 ద్రవిడ్ పదవీ విరమణ చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్రవిడ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియో ఒకటి బీసీసీఐ శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో 51 ఏళ్ల ద్రవిడ్ మాట్లాడాడు. భారత జట్టుకు కోచ్‌గా పని చేయడం, తనకు, తన కుటుంబానికి మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించిందని తెలిపాడు. ద్రవిడ్ తన పదవీకాలం మొత్తంలో విజయాలు, ఓటముల్లో టీమ్‌లోని ప్రొఫెషనలిజాన్ని ప్రశంసించాడు. టీమ్‌తో ఏర్పరచుకున్న బంధాలు నాకు మధురమైన జ్ఞాపకాలు అందించాయని అని చెప్పాడు.
ద్రవిడ్ నేతృత్వంలో ఘనతలు
2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి భారత కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు జట్టుతో కొనసాగాడు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌కు ముందు, ద్రవిడ్ నేతృత్వంలో భారత్ జట్టు రెండు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. గత సంవత్సరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. తృటిలో ట్రోఫీలను కోల్పోయింది. ద్రవిడ్ హయాంలో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా భారత్ నిలిచింది. ఆడిన 24 మ్యాచుల్లో 14 గెలిచింది, 7 ఓడింది. ఏకంగా భారత్ ఆరు సిరీస్‌లను గెలుచుకుంది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై భారీ సిరీస్ విజయాలు ఉన్నాయి.
🗣️🗣️“𝐅𝐨𝐧𝐝𝐞𝐬𝐭 𝐦𝐞𝐦𝐨𝐫𝐢𝐞𝐬 𝐰𝐢𝐥𝐥 𝐛𝐞 𝐭𝐡𝐞 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐢𝐨𝐧𝐬 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐛𝐮𝐢𝐥𝐭”
— BCCI (@BCCI) June 28, 2024
An eventful coaching journey in the words of #TeamIndia Head Coach Rahul Dravid, who highlights the moments created beyond the cricketing field ✨👏
𝘾𝙤𝙢𝙞𝙣𝙜 𝙎𝙤𝙤𝙣 on… pic.twitter.com/iiSb3LxgZ1
ద్రవిడ్ రోల్ మోడల్
ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగాలని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అతడిని రోల్ మోడల్‌గా పేర్కొన్నాడు. ద్రవిడ్‌తో కలిసి పని చేసిన, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని తెలిపాడు. 'నేను అతడిని కోచ్‌గా ఉండమని ఒప్పించడానికి ప్రయత్నించాను. కానీ అతను చూసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉంటాయి కదా. నేను పర్సనల్‌గా ద్రవిడ్‌తో నా సమయాన్ని ఆస్వాదించాను. మిగిలిన కుర్రాళ్ళు కూడా కచ్చితంగా అదే చెబుతారని అనుకుంటున్నాను. అతనితో పని చేయడం చాలా బాగుంది' అని రోహిత్ చెప్పాడు.
2007లో కరీబియన్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ త్వరగా ఎలిమినేట్ అయినప్పుడు, కెప్టెన్‌గా ద్రవిడ్ తీవ్ర నిరాశ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అదే చోట కోచ్‌గా వీడ్కోలు ముంగిట నిల్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అదే విండీస్ గడ్డపై ఐసీసీ ట్రోఫీ అందుకునే ఛాన్స్ వచ్చింది. దీంతో ఈసారైనా టీమ్ఇండియా నెగ్గాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ టోర్నీనే నాకు చివరిది - రాహుల్ ద్రవిడ్
'అది నేను డిసైడ్ చెయ్యను'- అయ్యర్, ఇషాన్ ఫ్యూచర్ కెరీర్‌పై ద్రవిడ్