ETV Bharat / sports

ప్రొ కబడ్డీ 2024: 'పుణెరి పల్టాన్​'దే టైటిల్- ఫైనల్​లో హరియాణా ఓటమి - ప్రొ కబడ్డీ సీజన్ 10 విజేత

Pro Kabaddi 2024 Final: ప్రొ కబడ్డీ సీజన్ 10 ఛాంపియన్​గా పుణెరి పల్టన్ నిలిచింది. శుక్రవారం ఫైనల్లో హరియాణాతో తలపడ్డ పుణెరి 28-23 తేడాతో నెగ్గి తొలిసారి ప్రొ కబడ్డీ టైటిల్ అందుకుంది.

pro kabaddi 2024 champion
pro kabaddi 2024 champion
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 6:40 AM IST

Updated : Mar 2, 2024, 9:25 AM IST

Pro Kabaddi 2024 Final: 2024 ప్రొ కబడ్డీ టైటిల్​ను పుణెరి పల్టన్ పట్టేసింది. శుక్రవారం హైదరాబాద్​ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఫైట్​లో పుణెరి పల్టాన్‌- హరియాణా స్టీలర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పుణెరి 28-23 తేడాతో నెగ్గి పీకేఎల్ సీజన్ 10 ఛాంపియన్​గా నిలిచింది. రైడింగ్‌లో పంకజ్‌ మోహితె (9), మోహిత్‌ గోయత్‌ (5), ట్యాక్లింగ్‌లో గౌరవ్‌ ఖత్రి (4), ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కెప్టెన్‌ అస్లాం ముస్తాఫా (4) అదరగొట్టి, హరియాణాపై పైచేయి సాధించారు. ఫలితంగా పుణెరి తొలిసారి పీకేఎల్ ఛాంపియన్​గా నిలిచింది.

అయితే హరియాణా జట్టు మ్యాచ్​ను ఘనంగానే ఆరంభించింది. ప్రారంభంలోనే 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, మోహిత్‌ను పట్టేసి పాయింట్ల ఖాతా తెరిచిన హరియాణా జోరు ప్రదర్శించింది. తొలి 12 నిమిషాల్లో ఇరు జట్లు కలిపి 11 పాయింట్లు సాధించగా ఇందులో 8 ట్యాక్లింగ్‌లో వచ్చినవే కావడం విశేషం. డిఫెండర్‌ మహమ్మద్రెజాను రైడర్‌ శివమ్‌ ఔట్‌ చేయడం వల్ల హరియాణా 6-6 తో స్కోరు సమం చేసింది.

ఆ తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఒక్కో పాయింట్ కోసం ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. రెండు జట్ల స్కోర్లు దగ్గరగా ఉండడం వల్ల, రిస్క్ చేయకుండా డూ ఆర్‌ డై రైడ్‌లో మాత్రమే పాయింట్ సాధించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో రైడింగ్​కు వెళ్లిన పుణెరి ప్లేయర్ పంకజ్‌ రైడింగ్​కు వెళ్లి 4 పాయింట్లు సాధించాడు. అప్పటి నుంచి లీడ్​ను కాపాడుకున్న పుణెరి 5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో హరియాణా రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హరియాణాలో శివమ్‌ (6) ఒక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు.

పీకేఎల్​లో పలు రికార్డులు

  • విజేతగా నిలిచిన పుణెరి రూ.3కోట్ల నగదు బహుమతి అందుకుంది.
  • రన్నరప్​ హరియాణా రూ.1.8కోట్లు సొంతం చేసుకుంది.
  • పీకేఎల్‌ టైటిల్ నెగ్గిన ఓడో జట్టుగా పుణెరి పల్టాన్‌ నిలిచింది.
  • పట్నా పరైట్స్ అత్యధికంగా (​(2016లో 3వ, 4వ సీజన్‌, 2017) మూడుసార్లు ఛాంపియన్​గా నిలిచింది.
  • జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (2014, 2022) రెండు సార్లు టైటిల్ నెగ్గింది.
  • యు ముంబా (2015), బెంగళూరు బుల్స్‌ (2018), బెంగాల్‌ వారియర్స్‌ (2019), దబంగ్‌ దిల్లీ (2021) ఒక్కోసారి టైటిల్ విజేతలుగా నిలిచాయి.

Asian Games 2023 : హాకీలో భారత్​కు స్వర్ణం.. టీమ్​ఇండియా చేతిలో పాక్​ చిత్తు.. ఈ సారీ వంద పతకాలు పక్కా!

PKL 2022: ప్రొ కబడ్డీ విజేతగా దబంగ్ దిల్లీ

Last Updated : Mar 2, 2024, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.