Prithvi Shaw Vijay Hazare Trophy : పృథ్వీ షా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అతడు అమ్ముడుపోలేదు. ఇప్పుడేమో ముంబయి విజయ్ హజారే ట్రోఫీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీ ఏటా బీసీసీఐ నిర్వహించే లిస్ట్ ఏ కాంపిటీషన్. ఈ సారి డిసెంబర్ 21 నుంచి మొదలుకానుంది.
తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మూడు మ్యాచ్‌లకు ముంబయి తన జట్టును ప్రకటించింది. అందులో పృథ్వీ షా పేరు లేదు. ముంబయికి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ముంబయి జట్టులో చోటు దక్కకపోవడంపై షా నిరాశ వ్యక్తం చేశాడు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. అందులో, "చెప్పు దేవా, నేను ఇంకా ఏమి చూడాలి? 65 ఇన్నింగ్స్‌లు, 126 స్ట్రైక్ రేట్‌తో (విజయ్ హజారేలో) 55.7 యావరేజ్‌తో 3399 పరుగులు చేస్తే (విజయ్ హజారేలో) నేను సరిపోను. కానీ నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నువ్వు, ప్రజలు ఇప్పటికీ నన్ను నమ్ముతారు. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగి వస్తాను" అని రాశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మోస్తరు ప్రదర్శన
ఇటీవల షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాడు. అంతకు ముందు ఫిట్‌నెస్, క్రమశిక్షణా కారణాలతో రంజీ ట్రోఫీ లీగ్ దశ మధ్యలో వేటు ఎదుర్కొన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. తొమ్మిది మ్యాచుల్లో 197 పరుగులు మాత్రమే చేశాడు. రెండు 40+, 30+ స్కోర్‌లు ఉన్నాయి. ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో ముంబయి కప్పు గెలిచింది.
అనంతరం షా గురించి అయ్యర్ మాట్లాడుతూ, "అతడు గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్. ఒక వ్యక్తిగా అతడు కలిగి ఉన్న ప్రతిభ, ఎవరికీ లేదు. తన వర్క్ ఎథిక్స్‌ను మెరుగుపరచుకోవాలి. అలా చేస్తే ఆకాశమే హద్దు.’ అని చెప్పాడు.
ముంబయి జట్టు ఇదే
షాతో పాటు వెటరన్ స్పిన్నర్ షామ్స్ ములానీ కూడా విజయ్ హరారే జట్టులో లేడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉన్నాడు. ముంబయి జట్టు, డిసెంబర్ 21న అహ్మదాబాద్‌లో కర్ణాటకతో తలపడనుంది.
జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, సిద్ధేష్ లాడ్, హార్దిక్ తమోర్, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), అథర్వ అంకోలేకర్, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తన్నా, వినాయక్ భోర్.
కేఎల్ రాహుల్ దూకుడు - కోహ్లీ, రోహిత్, పంత్ కన్నా అతడే బెటర్
కోహ్లీ, రోహిత్ కాదు - వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ అభిమాన క్రికెటర్ ఎవరో తెలుసా?