ETV Bharat / sports

ఒక్క పోస్ట్​తో ఇంటర్నెట్ షేక్​ - ప్రభాస్ లైఫ్​లోకి రానున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే? - Prabhas Instagram Post - PRABHAS INSTAGRAM POST

Prabhas Instagram Post : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసి ఫ్యాన్స్​కు షాక్​కు గురిచేశారు. ఓ ప్రత్యేకమైన వ్యక్తి తన లైఫ్​లోకి రానున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీ కోసం.

Prabhas Instagram Post
Prabhas Instagram Post (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 11:25 AM IST

Updated : May 17, 2024, 11:36 AM IST

Prabhas Instagram Post : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఆయన "డార్లింగ్స్ ఎట్టకేలకు మన లైఫ్​లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రానున్నారు. వెయిట్ చేయండి" అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రభాసేనా ఇలాంటి పోస్ట్ పెట్టింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట ఈ పోస్ట్ గురించి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

కొందరేమో ఆయనకు పెళ్లి అంటూ చెప్తుండగా, మరికొందరేమో ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ లేకుంటే కల్కి మూవీ ప్రమోషన్స్ అయ్యుండచ్చని అంటున్నారు. మరికొందరేమో ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విషయం గురించి ప్రభాస్ రివీల్ చేస్తే కానీ అసలు నిజం బయటకు రాదు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. 'మహానటి' ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్​, లోక నాయకుడు స్టార్ కమల్​ హాసన్​, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది ఈ సినిమా. కానీ ఈ మూవీటీమ్​ ఇంతవరకు ప్రమోషన్స్​ను స్టార్ట్ చేయలేదు. దీంతో అందరూ ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్​ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది అని ఆ మధ్య నాగ్ అశ్విన్ చెప్పారు. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో సాగే కథ ఇది అని మూవీటీమ్ చెబుతోంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రపంచాల్ని సృష్టించి రూపొందిస్తున్నారట. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

'ప్రభాస్ మేం చెప్పిన రోల్ చేయట్లేదు- తనకి నచ్చింది చేస్తున్నాడు' - Kannappa Prabhas

ఆ హాలీవుడ్ మూవీకి​ కల్కి కాపీనా? - నాగ్‌ అశ్విన్‌ అదిరిపోయే ఆన్సర్​! - Prabhas Kalki 2898 AD

Last Updated : May 17, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.