ETV Bharat / sports

షమీ సర్జరీ సక్సెస్​ఫుల్​- త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్ - PM Modi Reacts on Shami Surgery

PM Modi Reacts on Shami Surgery : కాలి మడమ గాయంతో బాధపడుతున్న భారత సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి సర్జరీ సక్సెస్​ఫుల్​గా జరిగింది. అయితే తనకు సర్జరీ సక్సెస్​ఫుల్​గా జరిగినట్లు షమీ పెట్టిన పోస్ట్​పై ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. షమీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

షమీ సర్జరీ సక్సెస్​ఫుల్​ - స్పందించిన ప్రధాన మంత్రి మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 12:05 PM IST

Updated : Feb 27, 2024, 1:48 PM IST

PM Modi Reacts on Shami Surgery : కాలి మడమ గాయం కారణంతో బాధపడుతున్న భారత సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి తాజాగా సర్జరీ సక్సెస్​ఫుల్​గా జరిగింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో తెలిపాడు. సర్జరీ తర్వాత ఆస్పత్రి బెడ్​పై దిగిన ఫొటోలను షేర్ చేశాడు. "మడమ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. కానీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నా కాళ్లపై నా అంతట నేనుగా నడవటానికి ఎదురుచూస్తుంటాను" అని షమీ రాసుకొచ్చాడు.

ఇక ఈ సర్జరీ జరగడం వల్ల షమీకి కొంతకాలం విశ్రాంతి అవసరం. అంటే అతడు మార్చిలో మొదలుకానున్న ఐపీఎల్ 2024 సీజన్​కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత జూన్​లో జరిగే టీ20 ప్రపంచ కప్​కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

స్పందించిన మోదీ : తాను సర్జరీ చేయించుకున్నట్లు షమీ పెట్టిన పోస్ట్​పై ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. "మీరు త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న ధైర్యంతో ఈ గాయం బారిన నుంచి త్వరగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది" అని రాసుకొచ్చారు.

కాగా వన్డే వరల్డ్‌ కప్‌ - 2023 తర్వాత రైటార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్రపంచ కప్​ -2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ టోర్నీలో అతడు ఎడమకాలి మడిమ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. నొప్పి వేధిస్తున్నా బాధను దిగమింగుకుని ఆడాడు.

కానీ అనంతరం నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కూ అందుబాటులో లేకుండా ఉండిపోయాడు. అయితే, మార్చిలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 17వ సీజన్​కు అయినా వస్తాడని అంతా ఆశించారు. కానీ ఇప్పుడది అసాధ్యమేనని తెలిసింది. అతడు లండన్​ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి మోదీ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Last Updated : Feb 27, 2024, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.